యాప్నగరం

ఆయన సంపద ఒక్కరోజే లక్షా 80 వేల కోట్లు పెరిగింది!

ప్రపంచ కుబేరుల జాబితాలో 14 వ స్థానంలో ఉన్న ఈ కోటీశ్వరుడి సంపాదన ఒక్క రోజులోనే లక్షా 80 వేల కోట్లకు పెరిగింది.

TNN 9 Jun 2017, 1:18 pm
ఆసియా ధనవంతుడు, అలీబాబా సంస్థ అధినేత జాక్ మా సంపద ఒక్క రోజులోనే 1.8 లక్షల కోట్లు పెరిగింది. చైనా ఆర్ధికవ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ, విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే అలీబాబా సంస్థ విక్రయాల వృద్ధి చెందాయి. బ్లూమ్‌బెర్గ్ కోటీశ్వరుల జాబితా ప్రకారం ప్రపంచంలో 14 వ స్థానంలో ఉన్న జాక్ మా సంపద అమాంతం పెరిగిపోయింది. ఏడాదిలో అతడి సంపద 8.5 బిలియన్ డాలర్ల నుంచి 41.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ ఆదాయం ఈ ఏడాది మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి 45 నుంచి 49 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది.
Samayam Telugu asias richest man jack ma sees net worth soar 2 8 billion in a day
ఆయన సంపద ఒక్కరోజే లక్షా 80 వేల కోట్లు పెరిగింది!


జాక్ మా ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్న అలీబాబా సంస్థ షేర్ల విలువ రికార్డు స్థాయిలో 13 శాతం మేర పెరిగాయి. అలీబాబా, టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆన్‌లైన్ షాపింగ్, సోషల్ మీడియాలో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. చైనా ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా సాగుతుండటంతో స్ట్రీమింగ్ మ్యూజిక్, వీడియోలకు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలపై అలీబాబా దృష్టిసారించింది. తన ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లో వీడియో లాంటి సాంఘిక అంశాలని చేర్చడం ద్వారా మరింత డిజిటల్ ప్రకటనల వ్యయాన్ని సంగ్రహించడానికి అలీబాబా ప్రయత్నిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.