యాప్నగరం

బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు హెచ్చరిక.. అలా చేయొద్దు.. లేదంటే..

మీరు బజాజ్ ఫైనాన్స్ కస్టమరా? అయితే కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఆన్‌లైన్ మోసాల బారిన పడొద్దని కంపెనీ తన కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. ఎవరైనా కాల్ చేసి ఆ విషయాలు చెబితే నమ్మవద్దని తెలిపింది.

Samayam Telugu 18 May 2021, 5:54 pm

ప్రధానాంశాలు:

  • బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు అలర్ట్
  • అప్రమత్తం చేస్తున్న కంపెనీ
  • లేదంటే మోసపోవాల్సి రావొచ్చు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu bajaj finance
దేశీ దిగ్గజ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ బజాజ్ ఫైనాన్స్ తన కస్టమర్లను హెచ్చరిస్తోంది. మోసగాళ్ల బారిన పడొద్దని అప్రమత్తం చేస్తోంది. లేదంటే నష్టపోవాల్సి రావొచ్చని అలర్ట్ చేస్తోంది. కస్టమర్లకు ఎస్ఎంఎస్ ద్వారా అప్రమత్తం చేస్తోంది. అందువల్ల బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి.
ఆన్‌లైన్ మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడు కోవాలని బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు తెలియజేసింది. సంస్థ అధికారులు కాల్ చేసి ఈఎంఐ కార్డు నెంబర్ లేదా ఓటీపీ వంటివి చెప్పమని కోరరని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఫీజు చెల్లిస్తే ఈఎంఐ కార్డు లిమిట్ పెంచుతామని కోరరని తెలిపింది.

అందువల్ల మీకు ఎవరైనా కాల్ చేసి ఈఎంఐ కార్డు లిమిట్ పెంచుతామని చెబితే నమ్మవద్దు. లేదంటే మోసపోవాల్సి వస్తుంది. నానాటికీ ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ ఈ మేరకు కస్టమర్లను అలర్ట్ చేస్తూ వస్తోంది. అందువల్ల వల్ల ఎవరైనా బజాజ్ ఫైనాన్స్ నుంచి కాల్ చేసి పైన పేర్కొన్న విషయాలు చెబితే నమ్మవద్దు.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.