యాప్నగరం

Stock Market Today: మార్కెట్లకు బ్యాంకింగ్, ఆటో అండ.. భారీ లాభాల్లో దూసుకుపోతున్న సూచీలు

ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లకు మదుపర్ల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తాయి. బ్యాంక్, ఆటో షేర్లు లాభాల పంట పండిస్తున్నాయి.

Samayam Telugu 12 Oct 2018, 10:47 am
గురువారం (అక్టోబరు 11) నాటి ట్రేడింగ్‌లో భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. నష్టాలకు చెక్ పెడతూ శుక్రవారం (అక్టోబరు 12) లాభాల బాటపట్టాయి. ముడి చమురు ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 10,350పైన ట్రేడింగ్‌ ఆరంభించింది. బ్యాంక్, ఆటో షేర్లు లాభాల పంట పండిస్తున్నాయి.
Samayam Telugu markets1


ఉదయం 10.30 సమయానికి సెన్సెక్స్‌ 649.76 పాయింట్లు లాభపడి 34,650.91 వద్ద, నిఫ్టీ 198.80 పాయింట్లు లాభపడి 10,433.45 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆరంభంలో 29 పైసలు బలపడింది. ప్రస్తుతం 50 పైసలు బలపడ్డ రూపాయి మారకం విలువ రూ.73.63 వద్ద కొనసాగుతోంది.

ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లకు మదుపర్ల నుంచి కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీంతో బజాజ్‌ ఫైనాన్స్‌, ఐబీ హౌసింగ్‌, హెచ్‌పీసీఎల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యస్‌ బ్యాంక్‌, ఎం అండ్ ఎం, ఐషర్‌, ఐవోసీ, అదానీ పోర్ట్స్‌, వేదాంతా షేర్లు లాభాలతో కొనసాగుతున్నాయి. మరోవైపు టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, సన్ ఫార్మా, సిప్లా తదితర షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.