యాప్నగరం

Bank of Baroda: ఈ ప్రభుత్వ బ్యాంకులో ఎఫ్‌డీ అకౌంట్ ఉందా...? అయితే మీకో శుభవార్త!

Bank of Baroda: ఇటీవల బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లు పెట్టిన తన ఖాతాదారులకు శుభవార్తలు చెబుతూ వస్తున్నాయి. ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ కట్టడి కోసం రెపో రేటును పెంచడంతో.. బ్యాంకులు కూడా వరుసబెట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సమీక్షిస్తున్నాయి. తాజాగా మరో ప్రభుత్వ బ్యాంకు తన ఎఫ్‌డీ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లను పెంచుతూ ప్రకటన చేసింది. ఈ పెంపును కూడా ఎప్పటి నుంచో కాకుండా తక్షణమే అమల్లోకి తీసుకొచ్చేసింది.

Authored byKoteru Sravani | Samayam Telugu 28 Jul 2022, 4:00 pm

ప్రధానాంశాలు:

  • వడ్డీ రేట్లు పెంచుతూ ప్రకటన చేసిన బ్యాంకు ఆఫ్ బరోడా
  • అన్ని టెన్యూర్లపై 35 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీలు పెంపు
  • కొత్త రేట్లు నేటి నుంచే అమల్లోకి తెస్తున్నట్టు వెల్లడి
  • సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 6.50 శాతం మధ్యలో రేట్లు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bank of Baroda
బ్యాంకు ఆఫ్ బరోడా
Bank of Baroda: బ్యాంకు ఆఫ్ బరోడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్‌దారులకు శుభవార్త చెప్పింది. రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తాలున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై(FDs)పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. అన్ని టెన్యూర్లపై 35 బేసిస్ పాయింట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ కొత్త వడ్డీ రేట్లు నేటి(జూలై 28, 2022) నుంచే అమల్లోకి తెస్తున్నట్టు బ్యాంకు ఆఫ్ బరోడా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
7 రోజుల నుంచి 45 రోజుల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంకు సమీక్షించింది. ఈ రేట్లను 2.80 శాతం నుంచి 3.00 శాతానికి పెంచింది. బ్యాంకు ప్రస్తుతం 46 రోజుల నుంచి 180 రోజుల వ్యవధి కలిగిన డిపాజిట్లపై 4 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది. అంతకుముందు ఈ రేటు 3.70 శాతంగా ఉంది.

Also Read : రియల్ ఎస్టేట్ దెబ్బ.. కొవ్వొత్తిలా కరిగిపోయిన బిలీనియర్ సంపద

181 రోజుల నుంచి 270 రోజుల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 35 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటును పెంచింది. దీంతో ఈ రేటు 4.30 శాతం నుంచి 4.65 శాతానికి పెరిగింది. అలాగే 271 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్ల పెంపు చేపట్టింది. దీంతో ఈ వడ్డీ రేట్లు 4.40 శాతం నుంచి 4.65 శాతానికి పెరిగాయి.

ఏడాదిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.30 శాతానికి వడ్డీ రేటు పెరిగింది. ఇది అంతకుముందు 5 శాతంగా ఉంది. మూడేళ్ల కంటే ఎక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటును బ్యాంకు 10 శాతం పెంచడంతో.. ఈ రేటు 5.35 శాతం నుంచి 5.50 శాతానికి పెరిగింది. ఏడాది కంటే ఎక్కువ కాల వ్యవధి నుంచి రెండేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై రేట్లను యథాతథంగా ఉంచింది. ఈ డిపాజిట్లపై వడ్డీ రేటు 5.45 శాతాన్ని ఆఫర్ చేస్తుంది. బ్యాంకు ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 6.50 శాతం మధ్యలో వడ్డీ రేట్లను ఆపర్ చేస్తుంది.

Also Read : తత్కాల్‌లో టిక్కెట్ బుక్ చేసుకునే వారికి శుభవార్త.. ఇక నుంచి అన్ని ట్రైన్లకు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.