యాప్నగరం

Home Loan: బ్యాడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు పెరిగాయ్.. RBI బాటలోనే దిగ్గజ బ్యాంక్ కీలక ప్రకటన!

Home Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం.. రెపో రేటును పెంచిన విషయం తెలిసిందే. దీంతో.. వెంటనే బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు షాక్ ఇచ్చింది. హోం లోన్ ఇంట్రెస్ట్ రేట్లను పెంచేసింది. దీంతో కొత్తగా హోం లోన్ పొందాలనుకునేవారు ఎక్కువ కట్టాల్సిందే.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 9 Feb 2023, 4:29 pm
Home Loan: హోం లోన్ వడ్డీ రేట్లను సవరించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేటుతో (BRLLR) లింక్ అయి ఉన్న అన్ని హోం లోన్లపై వడ్డీ రేట్లను పెంచేసింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 8న రెపో రేటును పెంచింది. ఈసారి 25 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును పెంచగా.. మొత్త రెపో రేటు 6.50 శాతానికి చేరింది. RBI వడ్డీ రేట్లను పెంచిన 24 గంటలు ముగియక ముందే ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. పెంచిన హోం లోన్ వడ్డీ రేట్లు 2023, ఫిబ్రవరి 9 నుంచి అమల్లోకి వస్తున్నట్లు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
Samayam Telugu Bank of Baroda


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా.. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ బేస్డ్ లెండింగ్‌కు సంబంధించి.. బ్యాంక్ ఆఫ్ బరోడా .. బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేటును (BRLLR) 2019, అక్టోబర్ 1 నుంచి అమలు చేస్తోంది. హోం లోన్లు ప్రస్తుతం ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు దగ్గర్లోని బ్యాంక్ బ్రాంచ్‌లను సంప్రదించొచ్చని స్పష్టం చేసింది.

Adani Power: ఏకంగా 96 శాతం పడిపోయిన అదానీ కంపెనీ లాభం.. మరీ రూ.9 కోట్లేనా?
2023, జనవరి 12 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా బేస్ రేటు వార్షిక ప్రాతిపదికన 9.15 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా BPLR 13.45 శాతంగా ఉంది. లోన్లపై బ్యాంక్ ఆఫ్ బరోడా MCLR రేట్లను చివరిసారిగా 2022, జనవరి 12న సవరించింది. ఇక ఇప్పటి సవరణలతో MCLR రేటు 7.50 శాతం నుంచి 7.85 శాతానికి చేరింది. ఇది ఒక నెల వ్యవధి ఉన్న వాటికి 7.95 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది. ఇక 3 నెలల MCLR రేటు 8.05 శాతం నుంచి 8.25 శాతానికి చేరింది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతుంటాయి. గతేడాది మే నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏకంగా రెపో రేటును 2.50 శాతం మేర అంటే 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో 4 శాతం రెపో రేటు నుంచి ప్రస్తుతం 6.50 శాతానికి చేరింది.


బ్యాంకులకు ముందుగానే అప్పులు చెల్లించనున్న అదానీ.. ఈసారి పెద్ద ప్లాన్‌తో!

Read Latest Business News and Telugu News
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.