యాప్నగరం

Bank Offers: కళ్లు చెదిరే ఆఫర్లు.. బ్యాంక్ కస్టమర్లకు ఇక పండగే.. లోన్లు తీసుకున్నవారు అలా చేస్తే..!

Bank Offers: దేశవ్యాప్తంగా నవరాత్రుల వేడుకలు (navratri season) శోభాయమానంగా జరుగుతున్నాయి. దీంతో ఎప్పటిలానే ఫెస్టివ్ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు అదిరే ఆఫర్లను తీసుకొస్తున్నాయి బ్యాంకులు. లోన్లు సహా క్రెడిట్, డెబిట్ కార్డులపై డిస్కౌంట్లను అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్ ఈ జాబితాలో ఉన్నాయి. మరి కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ఎలాంటి ఆఫర్లు అందిస్తున్నాయో చూద్దాం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 27 Sep 2022, 2:59 pm

ప్రధానాంశాలు:

  • భారత్‌లో పండగ సీజన్
  • కస్టమర్లను ఆకర్షిస్తున్న బ్యాంకులు
  • లోన్లు సహా క్రెడిట్/డెబిట్ కార్డులపై డిస్కౌంట్లు
  • ఆఫర్ కొద్దిరోజులే..!
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu BANK OFFERS
కస్టమర్లకు బ్యాంకు ఆఫర్లు

Festive Season Discounts: భారత్‌లో పండగ సంబరం మొదలైంది. నవరాత్రుల వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఎక్కడికక్కడ దుర్గామాత కొలువుదీరి భక్తుల మొక్కులు తీరుస్తోంది. భారత్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ-కామర్స్ సంస్థలు మంచి మంచి ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. దాదాపు అన్ని వస్తువులూ డిస్కౌంట్లో అందిస్తుంటాయి. ఇదే బాటలో ఫెస్టివ్ సీజన్లో ఆఫర్లను అందించడం బ్యాంకులు కూడా ఆనవాయితీగా మార్చుకున్నాయి. ఆ ఆఫర్లు చూస్తే పండగ వేళ బ్యాంకు కస్టమర్లు కూడా మరో పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ ఏం ఆఫర్లు ఇస్తున్నాయంటే..
ఈ రోజుల్లో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా.. చాలా మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్ వంటివి మంచి ఆఫర్లను ప్రకటించాయి. డిస్కౌంట్ ఆఫర్స్ సహా ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు వంటివి ఆఫర్ చేస్తున్నాయి.

ALSO READ: దుమ్మురేపుతున్న ఈ గోల్డ్ స్టాక్.. ఇన్వెస్ట్ చేస్తే కాసుల పంటే!

ఎస్‌బీఐ


నవరాత్రి వేడుకల వేళ.. ఎస్‌బీఐ కార్ల లోన్లు, పర్సనల్ లోన్లు, గోల్డ్ లోన్లపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. యోనో యాప్‌లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ 9 రోజులు లోన్లపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదని చెప్పిన ఎస్‌బీఐ.. లోన్ల ఈఎంఐలపైనా డిస్కౌంట్లను అందిస్తోంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

ఫెస్టివ్ సీజన్‌లో భాగంగా తాము కూడా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించనున్నట్లు ట్వీట్ చేసింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ హోమ్ అండ్ యూనియన్ మైల్స్ స్కీమ్‌లో భాగమైన వారికి.. ప్రాసెసింగ్ ఛార్జీలు మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్..


తాము అందించే.. హోమ్, కార్ లోన్లు సహా మైప్రాపర్టీ లోన్లపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు వసూలుచేయబోమని పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రకటించింది. ఇంకా ఎంపిక చేసిన కస్టమర్లకు హోమ్ లోన్ల కోసం డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..

కస్టమర్లకు నవరాత్రి శుభాకాంక్షలు చెప్పిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. తక్కువ వడ్డీకే లోన్లు ఇస్తామని ప్రకటించింది.

ఐసీఐసీఐ బ్యాంక్..

ఐసీఐసీఐ బ్యాంక్ మరో అడుగు ముందుకేసి.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ సహా లగ్జరీ గూడ్స్‌పై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. హోమ్, ఆటోమొబైల్, పర్సనల్, ట్రాక్టర్, గోల్డ్, టూ-వీలర్ లోన్లపైనా.. కేటగిరీలను బట్టి ఈ ఆఫర్లు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ అందించే డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి.. ఈ గ్రేట్ డిస్కౌంట్స్‌ను పొందొచ్చని వివరించింది.

ఎస్‌బీఐ కార్డ్ ఫెస్టివ్ ఆఫర్..

ఫెస్టివ్ సీజన్‌లో భాగంగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 31 వరకు ఎన్నో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఎస్‌బీఐ కార్డు పేర్కొంది. 2600కుపైగా సిటీల్లో.. దాదాపు 70కిపైగా నేషనల్ ఆఫర్లు, 1550 రీజనల్ అండ్ హైపర్‌లోకల్ ఆఫర్లను తీసుకొచ్చామని.. వీటి ద్వారా కస్టమర్లు 22.5 శాతం వరకు క్యాష్ బ్యాక్ బెనిఫిట్లు పొందుతారని స్పష్టం చేసింది.

ALSO READ: శాంసంగ్, యాక్సిస్ కొత్త క్రెడిట్ కార్డు.. భారీగా క్యాష్‌బ్యాక్‌లు, ఏడాదంతా భలే లాభం..
రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.