యాప్నగరం

టూవీలర్స్ పై తగ్గింపు ధరలు ఇలా ఉన్నాయి...

ద్విచక్రవాహనం కొనాలనుకుంటున్న వారికి శుక్రవారం బంపర్ ఆఫర్ సేల్ ఉంది.

TNN 31 Mar 2017, 8:17 am
ద్విచక్రవాహనం కొనాలనుకుంటున్న వారికి శుక్రవారం బంపర్ ఆఫర్ సేల్ ఉంది. బైక్ లేదా స్కూటర్లపై భారీ డిస్కౌంట్ ధరలను ప్రకటించాయి కంపెనీలు. దాదాపు రూ.5000 నుంచి 22,000 వరకు తగ్గింపు, క్యాష్ బాక్ ఆఫర్లు ఈ ఒక్కరోజు నడుస్తాయి. బీఎస్3 కాలుష్య ప్రమాణాలతో ఉన్న ద్విచక్రవాహనాలను ఏప్రిల్ 1 నుంచి అమ్మకూడదని సుప్రీం కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. ఎవరైనా అమ్మినా రిజిస్ట్రేషన్ చేయించడానికి వీల్లేకుండా నిబంధనలు మార్చింది. దీంతో హోండా, హీరో, సుజుకి, బజాజ్ వంటి వాహన తయారీ సంస్థలు తమ దగ్గరున్న నిల్వలను క్లియర్ చేయడంపై దృష్టి పెట్టాయి. ఇంకా ఒక్కరోజే సమయం ఉండడంతో ఈరోజు ఎలాగైనా అమ్మేయాలని అనుకుంటున్నాయి. మార్చి 31న కొనుగోలు చేసినట్టు ఇన్వాయిస్, ఇతర ధ్రువీకరణలను ఇచ్చి... ఆ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు అనుమతి ఉంది. తగ్గింపు వివరాలు ఇలా ఉన్నాయి.
Samayam Telugu bs iii bikes sell out like hot cakes over two day discounted offer
టూవీలర్స్ పై తగ్గింపు ధరలు ఇలా ఉన్నాయి...


హోండా కంపెనీ

హోండా తమ బైక్ ల కొనుగోలుపై రూ.22,000కు క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. యాక్టివా 3జి , డ్రీమ్‌ యుగ, సీబీ షైన్‌ , సీడీ 110డీఎక్స్‌ మోడళ్లపై తగ్గింపు లభిస్తుంది.

హీరో కంపెనీ

హీరో సంస్థ తమ మోటోకార్ప్ బైక్ పై రూ.12,500 తగ్గింపును ఇస్తోంది. ఇక స్కూటర్లపై 12,500రూపాయలు, ప్రీమియం బైక్ లపై రూ.7,500 తగ్గింపు ఇస్తోంది. డ్యూయెట్‌ (రూ.49,480), మాస్ట్రో ఎడ్జ్‌ (రూ.51,030), గ్లామర్‌ (రూ.59,755), స్ప్లెండర్‌ 125 (రూ.55,575) మోడళ్లపై ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి.

సుజుకి కంపెనీ

సుజుకి మోటార్‌సైకిల్‌ ఇండియా లెట్స్‌ బైక్ పై రూ.4,000 తగ్గింపుతోపాటు ఉచితంగా హెల్మెట్‌ను అందిస్తోంది. ఇక గిక్సర్‌ ధరలు రూ.77,452 – రూ.90,421 విలువ చేసే బైక్ లపై రూ.5,000 తగ్గింపు అందిస్తోంది.

బజాజ్‌ కంపెనీ

బజాజ్ సంస్థ తమ బైక్ మోడళ్లయినా ప్లాటినా, సీటీ 100 నుంచి పల్సర్‌ ఆర్‌ఎస్‌200లపై రూ.3,000 నుంచి రూ.12,000 వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది. అలాగే ఉచిత బీమాను అందిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.