యాప్నగరం

బీఎస్ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్లు!

ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్‌ఎల్) బంఫర్ ఆఫర్లు ప్రకటించింది.

TNN 13 Mar 2017, 5:42 pm
ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్‌ఎల్) బంఫర్ ఆఫర్లు ప్రకటించింది. హోలీ సందర్భంగా ఇప్పటికే అందిస్తున్న కొన్ని డాటా ప్లాన్స్‌లో భారీ మార్పులు చేసి తక్కువ ధరలకే ఎక్కు డాటా బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ ఆఫర్లన్నీ వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ఆఫర్లు పొందాలనుకునేవారు మార్చి 17లోగా రీచార్జ్ చేసుకోవాలి.
Samayam Telugu bsnl announces holi offer to give 7gb data
బీఎస్ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్లు!


ప్రస్తుతం అందుబాటులో ఉన్న డాటా ప్లాన్లు రూ. 156, రూ. 198, రూ. 291, రూ. 549 టారిఫ్‌లలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు రూ. 156 రీచార్జ్‌తో 4జీబీ డాటా అందించేది. కాలపరిమితి కూడా 10 రోజులే. కానీ ఇప్పుడు ఇదే ఆఫర్‌పై 7జీబీ డాటాను 28 రోజుల కాలపరిమితికి అందిస్తోంది. అలాగే రూ. 196 ఆఫర్‌పై కూడా 4జీబీ డాటాను అదనంగా అందిస్తోంది.

ఇక రూ. 291తో 28 రోజుల కాలపరిమితితో 14జీబీ డాటాను పొందొచ్చు. రూ. 549 రీచార్జ్‌తో 30జీబీ డాటాను 30 రోజుల కాలపరిమితితో అందిస్తోంది. అలాగే టాప్‌అప్ రీచార్జ్‌లపై కూడా బీఎస్‌ఎన్ఎల్ కొత్త ఆఫర్లు తీసుకొచ్చింది. రూ. 190తో రీచార్జ్ చేసుకుంటే రూ. 220 టాక్‌టైమ్, రూ. 490తో ప్లాన్‌తో రూ. 600 టాక్‌టైమ్ పొందొచ్చు. ఈ ఆఫర్లన్నీ మార్చి 17లోగా రీచార్జ్ చేసుకుంటేనే వర్తిస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.