యాప్నగరం

రూ.49కే అపరిమిత కాల్స్, రూ.36కే 1 జీబీ డేటా

జియోతో పోటీని తట్టుకోవడం కోసం ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి భారీ ఆఫర్లను ప్రకటించింది.

TNN 7 Feb 2017, 11:24 am
ల్యాండ్‌లైన్‌ కనెక్షన్లను భారీగా పెంచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోన్న ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఆదివారంతోపాటు, రోజూ రాత్రి పూట 9 గంటల నుంచి ఉదయం ఏడు గంటల మధ్య ల్యాండ్‌లైన్ నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా రూ.49కే అపరిమితంగా కాల్స్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ ఈ ఆఫర్ కోసం రూ.99 వసూలు చేస్తున్న బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు రూ.50 తక్కువ ధరకే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త కస్టమర్ల కోసం ఈ ఆఫర్ ప్రకటించినట్లు వెల్లడించిన బీఎస్ఎన్ఎల్ ఆరు నెలలపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆరు నెలల గడువు ముగిశాక రూ.49 రీచార్జి బదులు సర్కిల్‌ను బట్టి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Samayam Telugu bsnl offers mobile internet at 36 per gb
రూ.49కే అపరిమిత కాల్స్, రూ.36కే 1 జీబీ డేటా


మొబైల్ కస్టమర్ల కోసం కూడా బీఎస్ఎన్ఎల్ ఓ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. రూ.291 ఎస్టీవీ‌తో రీచార్జ్ చేసుకుంటే.. 28 రోజుల కాలపరిమితితో 8 జీబీ 3జీ డేటాను అందించనున్నట్లు వెల్లడించింది. అంటే రూ.36కే 1 జీబీ చొప్పున డేటాను బీఎస్ఎన్‌ఎల్ అందిస్తోందన్నమాట. ఇప్పటి వరకూ ఈ రీచార్జ్‌తో 2 జీబీ డేటా మాత్రమే లభిస్తుండగా.. దాన్ని ఇప్పుడు నాలుగు రెట్లు పెంచింది. రూ.78 రీచార్జ్‌తో 2 జీబీ డేటా పొందవచ్చని, దీని కాలపరిమితి ఐదు రోజులని తెలంగాణ టెలీకాం సర్కిల్ సీజీఎం అనంతరామ్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.