యాప్నగరం

జియోకి పోటీగా BSNL అన్‌లిమిటెడ్ ఆఫర్

'ఆ' నెట్‌వర్క్ దెబ్బకు అన్ని నెట్‌వర్క్‌లు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ పండగ చేస్కోమంటున్నాయి. తాజాగా బీఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్‌వర్క్ సంస్థ రూ. 149 లేదా అంతకంటే తక్కువ ధరకే అపరిమితంగా కాల్స్...

TNN 19 Dec 2016, 6:27 pm
'ఆ' నెట్‌వర్క్ దెబ్బకు అన్ని నెట్‌వర్క్‌లు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ పండగ చేస్కోమంటున్నాయి. తాజాగా బీఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్‌వర్క్ సంస్థ రూ. 149 లేదా అంతకంటే తక్కువ ధరకే అపరిమితంగా కాల్స్ చేసుకునే ఆఫర్‌ను త్వరలో ప్రకటించబోతోంది. రూ.149 రీఛార్జ్‌తో బీఎస్ఎన్ఎల్ నుంచి ఏ మొబైల్ నెట్‌వర్క్‌కు అయిన అపరిమితంగా కాల్స్ మరియు పరిమితంగా ఇంటర్నెట్ డేటాను జనవరి నుంచి అందించేందుకు యోచిస్తున్నామని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ వెల్లడించారు.
Samayam Telugu bsnl offers unlimited voice calls to any network with recharge of rs 149
జియోకి పోటీగా BSNL అన్‌లిమిటెడ్ ఆఫర్


ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఇన్‌కమింగ్ కాల్స్‌కు ఉచిత రోమింగ్ సర్వీస్ ఆఫర్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆఫర్ తోనే తమ నెట్‌వర్క్ వినియోగదారుల సంఖ్య పెరిగిందనీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల్లో తమ నెట్‌వర్క్ కు 10 శాతం ఉన్నారని అలాగే తాజాగా ప్రకటించబోయే ఆఫర్‌తో తమ వినియోగదారులను 15 శాతం పెంచుకునే లక్ష్యం పెట్టుకున్నామని శ్రీవాస్తవ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.