యాప్నగరం

తెలుగు రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు

ప్రభుత్వ రంగ టెలీకాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ తెలుగు రాష్ట్రాల్లో 4జీ సేవలను ప్రారంభించడానికి సన్నహాలు చేస్తోంది.

TNN 13 Apr 2017, 6:47 pm
ప్రభుత్వ రంగ టెలీకాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ తెలుగు రాష్ట్రాల్లో 4జీ సేవలను ప్రారంభించడానికి సన్నహాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లలోని ఎంపిక చేసిన పట్టణాలు, నగరాల్లో 4జీ సేవలను ప్రారంభించనున్నట్లు బీఎస్‌ఎన్ఎల్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మొత్తం 1,150 4జీ టవర్లను ఏర్పాటుచేసినట్లు తెలంగాణ టెలీకాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్. అనంతరామ్ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లోని తమ వినియోగదారులకు వేగవంతమైన 4జీ సేవలను అందించడంలో భాగంగా ఈ విస్తరణ ప్రాజెక్టును చేపట్టినట్లు ఆయన వివరించారు.
Samayam Telugu bsnl to offer 4g services in select cities of ap telangana
తెలుగు రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు


ఏపీ, తెలంగాణ సర్కిళ్లలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 2,526.18 కోట్ల ఆదాయం వచ్చినట్లు అనంతరామ్ చెప్పారు. గతేడాది ఆదాయం రూ. 2,463.90 కోట్లతో పోలిస్తే ఇది 2.53 శాతం తక్కువని వెల్లడించారు. అయితే మొబైల్ ఆపరేషన్స్‌లో మాత్రం బీఎస్‌ఎన్‌ఎల్ రికార్డు స్థాయి ఆదాయం పొందిందని చెప్పారు. రెండు సర్కిళ్లలో కలుపుకుని 2016-17 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఆపరేషన్స్‌కి 1,475.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 5 శాతం అధికమని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.