యాప్నగరం

Canara Bank: ఏకంగా 90 శాతం పెరిగిన బ్యాంక్ లాభం.. ఎన్ని వేల కోట్లో తెలుసా? డివిడెండ్ కూడా ప్రకటన!

Canara Bank: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఒకటి గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఏకంగా బ్యాంక్ లాభం 90 శాతం పెరగడం విశేషం. ఇదే క్రమంలో ఇన్వెస్టర్లలో జోష్ నింపే ప్రకటన చేసింది. డివిడెండ్ ప్రకటించింది.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 8 May 2023, 6:49 pm
Canara Bank: కెనరా బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. నికర లాభం ఏకంగా 90 శాతం పెరగడం విశేషం. మొత్తం లాభం రూ.3175 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 1666.22 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ఇక నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కం.. 23.01 శాతం మేర పెరిగి రూ.8616 కోట్లుగా ఉంది. ఇది ఇంట్రెస్ట్ ఎర్న్‌డ్, ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్ మధ్య వ్యత్యాసం. ఏడాది కిందట ఇది రూ.7006 కోట్లుగా ఉండేది. ఇక ఫలితాలు ప్రకటించిన సమయంలోనే కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ స్టాక్ షేర్లు ఉన్నవారికి ఇది గుడ్‌న్యూస్. రూ.10 ఫేస్ వాల్యూ ఉన్న ప్రతి షేరుకు రూ.12 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ఇది రూ.120 శాతం అన్నమాట.
Samayam Telugu canara bank


ఈ ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల ఆమోదం లభించాల్సి ఉంది. దీనికి 31.03.2023 నుంచి అమల్లోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. లెండర్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.7252 కోట్లుగా నమోదైంది. ఇది గతేడాదితో పోలిస్తే 17 శాతం ఎక్కువ. ఇక నాన్ పెర్ఫామింగ్ అసెట్స్ రేషియో కూడా 1.73 శాతానికి తగ్గినట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. ఇక గ్లోబల్ బిజినెస్ 12 శాతం పెరిగి రూ.20.41 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ఇదే క్రమంల ో డిపాజిట్లు కూడా పెరిగినట్లు వెల్లడించింది.



వాట్సాప్ యూజర్లకు హెచ్చరిక.. సరికొత్త స్కాం.. మీకు ఇలా జరుగుతుందా.. జర జాగ్రత్త!



రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.