ప్రముఖ బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఛైర్మన్, నాన్‌ఎగ్జిక్యూటివ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ దేవదాస్మాల్యా మాంగళూరు (66) కన్నుమూశారు. ఆయన రెండు సంవత్సరాల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని, చికిత్స పొందుతూ ఆదివారం (నవంబరు 25) కన్నుమూశారని.. ఇండిగో సంస్థను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ స్టాక్‌మార్కెట్ ఫైలింగ్ సమాచారంలో తెలిపింది. ఆయన హఠాన్మరణం కంపెనీకి తీరని లోటంటూ సంతాపం వ్యక్తం చేసింది.
దేవదాస్ లేని లోటు తీరనిదని బోర్డు డైరెక్టర్లు, ఉద్యోగులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన దేవదాస్‌కు అపారమైన అనుభవం ఉందని, బ్యాకింగ్ రంగంలో విశేషమైన సేవలు చేశారని ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు గుర్తు చేశారు.