యాప్నగరం

ఎస్‌బీఐ అలర్ట్: కొత్త చెక్‌బుక్‌లు తీసుకోండి

సెప్టెంబర్ 30 తర్వాత మీ పాత చెక్‌బుక్ చెల్లదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. విలీనమైన బ్యాంకుల చెక్‌బుక్‌లు..

TNN 21 Sep 2017, 7:32 pm
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో ఖాతా ఉందా? మీరు ఆ బ్యాంక్ చెక్ బుక్ వాడుతున్నారా? అయితే ఇక మీదట అవి చెల్లుబాటు కావు. ఎస్‌బీహెచ్‌తోపాటు ఆరు అనుంబంధ బ్యాంకుల చెక్‌బుక్‌లు చెల్లవని ఎస్‌బీఐ ప్రకటించింది. ఎస్‌బీహెచ్‌తోపాటు భారతీయ మహిళా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ రాయ్‌పూర్ బ్యాంకుల శాఖల్లో ఖాతాలు ఉన్నవారు... కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. కొత్త ఐఎఫ్ఎస్ కోడ్‌లను కూడా పొందాలని తెలిపింది.
Samayam Telugu cheque books ifsc codes of sbh will be invalid after september 30 sbi
ఎస్‌బీఐ అలర్ట్: కొత్త చెక్‌బుక్‌లు తీసుకోండి


ఈ ఏడాది ఏప్రిల్ 1న ఆరు అనుంబంధ బ్యాంకులు ఎస్‌బీఐలో విలీనమయ్యాయి. ఈ విలీనం వల్ల రూ. 37 లక్షల కోట్ల ఆస్తులతో ప్రపంచంలోని 50 పెద్ద బ్యాంకుల్లో ఒకటిగా ఎస్‌బీఐ అవతరించింది. డిపాజిట్లు రూ. 18.50 లక్షల కోట్ల నుంచి రూ. 26 లక్షల కోట్లకు పెరిగాయి.

We request customers of SBI's erstwhile Associate banks and Bharatiya Mahila Bank to apply for new SBI Cheque books as soon as possible. pic.twitter.com/iWhq4xtbrn— State Bank of India (@TheOfficialSBI) September 20, 2017
సెప్టెంబర్ 30 వరకూ ఆ ఆరు బ్యాంకుల పాత చెక్కులు, ఐఎఫ్ఎస్ కోడ్ చెల్లుబాటు అవుతాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. బ్యాంకుకి వెళ్లడంతోపాటు ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం ద్వారా చెక్‌లను పొందొచ్చని తెలిపింది.

జన్‌ధన్ యోజన, శాలరీ అకౌంట్లు, చిన్న, సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వలు లేకున్నా ఛార్జీలు వసూలు చేయడం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కనీస బాదుడు రూపంలో మూడు నెలల్లో 38.8 కోట్ల ఖాతాదారుల నుంచి ఎస్‌బీఐ 235.06 కోట్లను వసూలు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.