యాప్నగరం

సామాన్యులకు కేంద్రం భారీ ఊరట.. దిగిరానున్న వంట నూనె ధరలు.. ఎంతంటే..

వంట నూనె ధరలు దిగిరానున్నాయి. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాల తగ్గింపు ప్రయోజనాలను సామాన్యులకు చేరేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. దీంతో ధరలు దిగిరావొచ్చు.

Samayam Telugu 19 Oct 2021, 4:05 pm

ప్రధానాంశాలు:

  • సామాన్యులకు తీపికబురు
  • తగ్గనున్న వంట నూనె ధరలు
  • కేంద్రం కీలక ఆదేశాలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu oil price
సామాన్యులకు ఊరట కలిగే అంశం ఒకటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు తీపికబురు అందించింది. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వంట నూనెలపై దిగుమతి సుంకాల తగ్గింపు ప్రయోజనాలను ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
మోదీ సర్కార్ ఇటీవల వివిధ క్రూడ్ ఆయిల్స్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే. సన్ ఫ్లవర్, సోయాబీన్, వేరు శనగ వంటి పలు రకాల నూనెలు ఇందులో ఉన్నాయి. అలాగే రిఫైన్డ్ ఆయిల్స్‌పై కూడా కేంద్ర ప్రభుత్వం సుంకాలను తగ్గించింది.

Also Read: undefined

క్రూడ్ పామ్ ఆయిల్, క్రూడ్ సోయాబిన్ ఆయిల్, క్రూడ్ సన్ ఫ్లవర్ ఆయిల్ వంటి వటిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 2.5 శాతం నుంచి జీరోకి తగ్గించేసింది. అగ్రి సెస్‌ను కూడా పామ్ ఆయిల్‌కు 20 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. క్రూడ్ సోయాబీన్, క్రూడ్ సన్ ఫ్లవర్ ఆయిల్‌కు దీన్ని 5 శాతానికి తగ్గించింది.

ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసింది. వంట నూనె ధరలు వెంటనే తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఇందులో ఉంది. దిగుమతి సుంకాల తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని కోరింది. దీంతో వంట నూనె ధరలు కేజీకి రూ.15 నుంచి 20 వరకు తగ్గొచ్చని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.