యాప్నగరం

కూల్‌ప్యాడ్ కూల్1పై రూ. వెయ్యి తగ్గింపు!

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ కూల్‌ప్యాడ్ తన కూల్1 స్మార్ట్‌ఫోన్‌పై భారత్‌లో రూ. 1000 డిస్కౌంట్‌ను ప్రకటించింది.

TNN 17 Mar 2017, 5:08 pm
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ కూల్‌ప్యాడ్ తన కూల్1 స్మార్ట్‌ఫోన్‌పై భారత్‌లో రూ. 1000 డిస్కౌంట్‌ను ప్రకటించింది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన కూల్‌ప్యాడ్ కూల్1 ఇప్పటి వరకు రూ. 13,999కి లభించింది. ఇప్పుడు రూ. వెయ్యి తగ్గింపుతో రూ. 12,999కే కూల్‌ప్యాడ్ అందిస్తోంది. అయితే ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ మాత్రమేనని, కూల్‌1పై ఈ ఆఫర్ ప్రత్యేకంగా అమెజాన్‌లో మాత్రమే ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు ఒక ట్వీట్ కూడా చేసింది.
Samayam Telugu coolpad cool1 smartphone available at rs 1000 discount
కూల్‌ప్యాడ్ కూల్1పై రూ. వెయ్యి తగ్గింపు!


మరో చైనా కంపెనీ లీఈకోతో కలసి కూల్‌ప్యాడ్ తయారుచేసిన తొలి ఫోన్ కూల్1 కావడం విశేషం. వాస్తవానికి కూల్‌ప్యాడ్‌లో అత్యధిక వాటా లీఈకో సొంతం చేసుకుంది. కాగా, 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ప్లేతో వచ్చిన కూల్ ప్యాడ్ కూల్1.. పటిష్ఠమైన ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 652 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తోంది. స్టోరేజీని మైక్రోఎస్డీతో పెంచుకునే సదుపాయం ఈ ఫోన్‌కు లేకపోవడం ఒక మైనస్.
#CoolpadCarnival: 2 million lives, 1 amazing phone & an even more incredible thank you. #CoolpadCool1 is now available @ just Rs. 12,999. pic.twitter.com/FtmuUp1GkA — Coolpad India (@CoolpadInd) March 17, 2017
ఇక ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో డ్యుయల్ టోన్ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో వెనుకవైపు రెండు 13ఎంపీ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీల కోసం 8ఎంపీ వైడ్ యాంగిల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. వెనుక కెమెరాతో 4కె వీడియోలు తీయొచ్చు. గోల్డ్, సిల్వర్ రంగుల్లో లభించే ఈ ఫోన్‌లో 4జీ వీవోఎల్టీఈ, 3జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సి తదితర కనెక్టివిటీ ఫీచర్లున్నాయి. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో 4,060 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో అమర్చారు. అయితే కూల్1 64జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌లో కూడా లభిస్తోంది. దీని ధర రూ. 15,999.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.