యాప్నగరం

Zomato Food Order: జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాడు.. బిల్లు చూసి బిత్తరపోయాడు!

Swiggy vs Zomato : మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? అయితే ఒక విషయం తెలుసుకోండి. ఆఫ్‌లైన్‌లో ఆర్డర్ చేసే దాని కన్నా ఆన్‌లైన్‌లో జొమాటో వంటి యాప్స్ ద్వారా ఆర్డర్ చేస్తే భారీ వ్యత్యాసం ఉంటోంది. తాజాగా ఒక లింక్డ్ ఇన్ యూజర్ ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రెండు బిల్లుల మధ్య ఎంత తేడా ఉందో తెలియజేశాడు. ప్రభుత్వం ఈ ధర వ్యత్యాసాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని కోరారు.

Authored byKhalimastan | Samayam Telugu 4 Jul 2022, 11:52 am

ప్రధానాంశాలు:

  • ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా?
  • అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
  • బిల్లు మొత్తంలో ఎంత వ్యత్యాసం ఉంటుందో చూడండి
  • ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu zomato
జొమాటో ఫుడ్ ఆర్డర్
Food Online Order: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ కస్టమర్లను మామూలుగా బాదడం లేదు. చార్జీల మోత మోగిస్తున్నాయి. ఇటీవల కాలంలో చాలా మంది ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ బాట పట్టారు. దీంతో కంపెనీలకు బాగా కలిసొచ్చింది. అటు రెస్టారెంట్లకు ఆర్డర్లు పెరుగుతాయి. ఇటు ఫుడ్ డెలివరీ యాప్స్‌కు లాభాల పంట. అయితే ఇక్కడ కస్టమర్ల మాత్రం చార్జీల బాదుడు భరించాల్సి వస్తోంది. ఆన్‌‌లైన్ ఫుడ్, ఆఫ్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపై భారీ వ్యత్యాసం ఉంది. దీనికి సంబంధించి తాజాగా ఒక లింక్డ్ ఇన్ యూజర్ చేసిన పోస్ట్ నెటింట్లో వైరల్ అవుతోంది.
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే బిల్లు ఎంత పడుతుంది? ఆఫ్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే బిల్ల ఎంత పడింది? అనే విషయాన్ని తెలియజేశారు. ఈ రెంటింటి బిల్లుల మధ్య వ్యత్యాసం ఎంతో తెలిస్తే కంగుతినాల్సిందే. రాహుల్ కబ్రా అనే యూజర్ రెండు బిల్లుల ఫోటోలను షేర్ చేశారు. ఒకటే ఫుడ్ ఆర్డర్ కానీ బిల్లులు వేరు. వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్‌రూమ్ మోమో ఆర్డర్ చేశారు. ఆఫ్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే బిల్లు రూ. 512 అయ్యింది. ఇందులో సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ కలిసే ఉన్నాయి. అదే ఫుడ్ ఆర్డర్‌ను జొమాటోలో ఇస్తే బిల్లు మొత్తం రూ. 689.9గా ఉంది. డిస్కౌంట్ రూ. 75 పోనూ ఈ బిల్లు పడింది. అంటే బిల్లు మొత్తం దాదాపు 35 శాతం ఎక్కువగా ఉంది. దీంతో మన హైదరాబాద్‌లో మరో బిర్యానీ తినొచ్చు.

‘బిల్లు మొత్తం పెరుగుదలను నియంత్రించడానికి ప్రభుత్వం తగిన చర్యలను అమలు చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. తద్వారా ఇది వాటాదారులందరికీ విజయం చేకూరుస్తుంది’ అని కోబ్రా తెలియజేశారు. కస్టమర్ అక్విజిషన్ కాస్ట్‌తో ప్రతి స్టార్టప్ ఇబ్బంది పడుతూ ఉంటుందన్నారు. కస్టమర్ల విషయానికి వస్తే వారి ద్వారా విలువ పొందాలంటే రిటెన్షన్ అనేది చాలా కీలకమని అభిప్రాయపడ్డారు. స్థిరమైన ఒమ్నీ ఛానల్ అడ్వర్టైజింగ్‌‌ వల్ల ఈ విషయంలో జొమాటోనే నా మనసులో అగ్రస్థానంలో ఉంటుందన్నారు. కానీ నేను ఒక సగటు సాధారణ భారతీయ కస్టమర్‌గా చూస్తే.. ధరలను విశ్లేషిస్తారని, ఎక్కడ అయితే బెనిఫిట్ ఉంటుందో గుర్తిస్తారని వివరించారు. కాగా ఈ పోస్ట్‌కు 7600కు పైగా రియాక్షన్స్ వచ్చాయి. 1000కి పైగా కామెంట్లు ఉన్నాయి.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.