యాప్నగరం

ESI గుడ్ న్యూస్.. ఇకపై వారికి రూ.7,500.. కేంద్రం కీలక నిర్ణయం!

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) కార్పొరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ వేతనం పొందుతున్న వారు ఈఎస్ఐ వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చు. ఈఎస్ఐ తాజాగా తన సబ్‌స్క్రైబర్లకు శుభవార్త అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది.

Samayam Telugu 15 Feb 2020, 1:39 pm
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ) కార్పొరేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ వేతనం పొందుతున్న వారు ఈఎస్ఐ వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చు. ఈఎస్ఐ తాజాగా తన సబ్‌స్క్రైబర్లకు శుభవార్త అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది.
Samayam Telugu employees state insurance corporation eases burden on pregnant women increases confinement expenses to rs 7500
ESI గుడ్ న్యూస్.. ఇకపై వారికి రూ.7,500.. కేంద్రం కీలక నిర్ణయం!


పరిహారం పెంపు

ఈఎస్ఐ తాజాగా గర్భిణీ స్త్రీలకు కన్ఫైన్మెంట్ ఖర్చులను పెంచుతున్నట్లు ప్రకటించింది. రూ.5,000 నుంచి రూ.7,500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ.2,500 పెంచింది. ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో కాకుండా ఇతర హాస్పిటల్స్‌కు వెళ్లి వైద్యం చేయించుకునే వారికి ఈ డబ్బులు అందజేస్తారు.


Also Read: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. ఎంతంటే?

ఈ షరతు వర్తింపు

కాగా రూ.7,500 పరిహారం పొందాలంటే మహిళలు ఈఎస్ఐసీ డిస్పెన్సరీల నుంచి మరే ఇతర మెటర్నిటీ సర్వీసులు పొందకూడదు. ఇలాంటి వారికే రూ.7,500 డబ్బులు అందిస్తారు. ఫిబ్రవరి 13న జరిగిన ఈఎస్ఐ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.


Also Read: SBI, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేస్తే 2 లాభాలు.. రూ.1.5 లక్షలు ఆదా!

అందుకే ఈ పెంపు

ఈఎస్ఐ గర్భిణీ స్త్రీలకు ఇచ్చే పరిహారం పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం.. ప్రస్తుతం జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) పెరుగుదల నేపథ్యంలో కన్ఫిన్మెంట్ ఖర్చులు కూడా పెరిగాయి. అందుకే ప్రస్తుతమున్న కన్ఫిన్‌మెంట్ వ్యయాన్ని రూ.5,000 నుంచి రూ.7,500 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.


Also Read: PF అలర్ట్: జాబ్ మారుతున్నారా? ఇలా చేయండి.. లేదంటే పీఎఫ్ విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్ కుదరదు!

మెడికల్ అడ్మిషన్లకు ఆమోదం

కాగా ఈఎస్ఐ 2020-21 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి ఈఎస్‌ఐసీ మెడికల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కోటా, అడ్మిషన్స్‌కు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఇన్సూర్డ్ పర్సన్స్ కోటా కింద ఎంబీబీఎస్/బీడీఎస్ సీట్ల అడ్మిషన్స్‌కు కూడా ఓకే చేసింది.


Also Read: రోజుకు రూ.140తో నెలకు రూ.19,000 పెన్షన్.. ఈ స్కీమ్‌తో ఇంకా ఎన్నో అదిరిపోయే బెనిఫిట్స్!

కంట్రిబ్యూషన్ తగ్గింపు

కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఉద్యోగి ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ తగ్గించింది. కంపెనీ కంట్రిబ్యూషన్ 4.75 శాతం నుంచి 3.25 శాతానికి, ఉద్యోగుల కంట్రిబ్యూషన్ 1.75 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గింది. దీంతో 3.6 కోట్ల మంది ఉద్యోగులు, 12.85 లక్షల మంది యజమానులకు ప్రయోజనం లభించింది. దీని వల్ల సంస్థలకు రూ.5,000 కోట్ల మేర ఆదా అవుతుంది.


Also Read: హోమ్ లోన్ తీసుకుంటే ఏకంగా రూ.5 లక్షలు ఆదా.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!

ఈఎస్‌ఐ బెనిఫిట్స్

ఈఎస్‌ఐ కార్పొరేషన్ వల్ల సమగ్రమైన సామాజిక భద్రత పొందొచ్చు. మెడికల్ కేర్, క్యాష్ బెనిఫిట్స్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. నెలకు రూ.21,000 లోపు వేతనం ఉన్నవారికి ఈఎస్ఐ వర్తిస్తుంది. వీరికి ఈఎస్ఐ కార్డు అందజేస్తారు. ప్రస్తుతం 13.5 కోట్ల మంది ఈఎస్ఐ లబ్దిదారులు ఉన్నారు.


Also Read: పాన్ కార్డు ఉన్న వారికి తుది హెచ్చరిక.. వెంటనే ఆ పని పూర్తి చేయండి.. లేదంటే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.