యాప్నగరం

రూ.10 నాణాలు ఇలా ఉంటే చెల్లుతాయి: RBI

రూ.10 నాణాలు చెల్లవంటూ వస్తున్న వదంతులు నమ్మవద్దని, అవి తప్పకుండా చెల్లుతాయని RBI స్పష్టత ఇచ్చింది. రంగు, రూపం ఎలా ఉన్న తీసుకోవచ్చని పేర్కొంది.

TNN 21 Nov 2016, 8:56 pm
మార్కెట్లో నకిలీ రూ.10 నాణాలు చెలామణి అవుతున్నాయనే వదంతులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొట్టిపడేసింది. తప్పకుండా అవి చెల్లుబాటు అవుతాయని, వాటిపై ఎటువంటి ఆందోళన వద్దని స్పష్టం చేసింది. రూ.పది నాణాలు నకిలీవి చెలామణి అవుతున్నాయంటూ సోషల్ మీడియా రూమర్లు రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో, చాలా ప్రాంతాల్లో వాటిని స్వీకరించడం లేదు. అసలే, పెద్ద నోట్ల రద్దుతో చిల్లర సమస్యలను ఎదుర్కంటోన్న ప్రజలకు ఇది కాస్తా గోరు చుట్టుపై రోకటి పోటులా మారింది. ఈ నేపథ్యంలో RBI ఒక స్పష్టత ఇచ్చింది. 2011 ముందు ముద్రించిన నాణాలపై రూపాయి సింబల్ ఉండదని తెలిపింది. జులై 2011 తర్వాత ముద్రించిన నాణాలకు మాత్రమే ఆ గుర్తు ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో ఎటువంటి నకిలీ రూ.10 నాణాలు లేవని, నిరభ్యంతరంగా వాటిని స్వీకరించవచ్చని స్పష్టం చేసింది. రూ.10 కాయిన్‌లో రెండు లోహాల ఉంటాయి. 27 ఎంఎం వ్యాసం, 7.71 గ్రాముల బరువు ఉంటాయి. అయితే, కాలక్రమేనా ఇవి రంగు, రూపం కోల్పోతాయి.
Samayam Telugu fake coins business rbisays they are legal and valid
రూ.10 నాణాలు ఇలా ఉంటే చెల్లుతాయి: RBI

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.