యాప్నగరం

పాతఫోన్లను కొంటున్న ఫ్లిప్‌కార్ట్!

దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను రెండింతలు చేసేందుకు ప్రయత్నిస్తోంది.

TNN 12 May 2017, 5:31 pm
దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను రెండింతలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో కొన్న ఫోన్లకు ‘బైబ్యాక్ గ్యారంటీ’ ఇవ్వనుంది. మే 14 నుంచి ప్రారంభంకానున్న ‘బిగ్ 10 సేల్’లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లపై ఈ ‘బైబ్యాక్ గ్యారంటీ’ ప్లాన్‌ను ప్రారంభించనుంది.
Samayam Telugu flipkart big10 sale website to offer buyback guarantee on smartphones
పాతఫోన్లను కొంటున్న ఫ్లిప్‌కార్ట్!


‘బైబ్యాక్ గ్యారంటీ’ ప్లాన్ కింద ఫ్లిప్‌కార్ట్‌లో కొన్న ప్రముఖ కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లను సరసమైన ధరలకే మళ్లీ వినియోగదారుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. మీ పాత ఫోన్‌‌ ఎక్స్‌ఛేంజ్‌పై మరో కొత్త ఫోన్ తీసుకుంటేనే ఈ ప్లాన్ వర్తిస్తుంది. అంటే మిగిలిన ఫోన్లపై వచ్చే ఎక్స్‌ఛేంజ్ కంటే ఈ ప్లాన్ కింద తీసుకున్న ఫోన్లకు ఎక్స్‌ఛేంజ్ విలువ ఎక్కవ ఉంటుంది. దీనికి కూడా కాల పరిమితి ఉంటుంది. మీరు ఫ్లిప్‌కార్టులో ఫోను కొనుగోలు చేసిన తరవాత 6 నుంచి 8 నెలల మధ్య కానీ లేదా 9 నుంచి 12 నెలల మధ్య కానీ ఎక్స్‌ఛేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ బై‌బ్యాక్ గ్యారంటీ ప్లాన్‌ను పొందాలంటే ఫోన్ ధరతో పాటు అదనంగా రూ. 399 చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆ ఫోన్‌ను మళ్లీ వెనక్కి కొనడానికి ఫ్లిప్‌కార్ట్ ఒక ధరను నిర్ణయిస్తుంది. మీరు ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకున్నప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ మీ ఇంటికి వచ్చి ఫోన్‌ను పికప్ చేసుకుంటాడు. ఈ ప్లాన్‌ను తొలుత మార్చిలో మోటో జీ5 ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ ప్రారంభించింది. దీనికి మంచి ఆదరణ రావడంతో మిగిలిన టాప్ బ్రాండ్లకు ఈ ప్లాన్‌ను వర్తింపచేయాలని తాజాగా నిర్ణయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.