యాప్నగరం

ఫోర్బ్స్ ధనవంతుల జాబితా: అగ్రస్థానంలో ముకేశ్

ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత ధనవంతులైన భారతీయుల జాబితాలో ముకేశ్ అంబానీ వరుసగా పదోసారి అగ్రస్థానంలో నిలిచారు.

TNN 5 Oct 2017, 12:10 pm
భారత్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వరుసగా పదోసారి అగ్రస్థానంలో నిలిచారు. ముకేశ్ నికర ఆస్తుల విలువ 38 బిలియన్ డాలర్లని ప్రముఖ మ్యాగజీన్ ఫోర్బ్స్ తెలిపింది. దేశంలోని వంద మంది అత్యంత ధనవంతుల ఆస్తుల విలువ 479 బిలియన్ డాలర్లుగా తేలింది. గత ఏడాది 374 బిలియన్ డాలర్లుగా ఉన్న వీరి సంపద ఏడాదిలో 26 శాతం పెరిగింది. దేశ ఆర్థిక ప్రగతి కొద్దిపాటి మందగమనంలో ఉన్నప్పటికీ.. వీరి ఆస్తులు మాత్రం భారీగా పెరగడం విశేషం.
Samayam Telugu forbes list mukesh ambani is the richest indian for 10th year
ఫోర్బ్స్ ధనవంతుల జాబితా: అగ్రస్థానంలో ముకేశ్


ముకేశ్ అంబానీ ఆస్తులు 2016లో 22.7 బిలియన్ డాలర్లు ఉండగా.. ఏడాది కాలంలో 67 శాతం పెరిగి 38 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. ఆస్తులు వేగంగా పెరగడంతో ఆయన ఆసియాలోని టాప్-5 ధనవంతుల జాబితాలో చేరారు.

ఏడాదిలో 4 బిలియన్ డాలర్ల మేర ఆస్తులను పెంచుకున్న విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ ధనవంతుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నారు. ఈయన ఆస్తులు 19 బిలియన్ డాలర్లని ఫోర్బ్స్ వెల్లడించింది. 18.4 బిలియన్ డాలర్లతో హిందుజా సోదరులు మూడోస్థానంలో నిలిచారు.

భారత్‌లోని టాప్-10 ధనవంతులు:

1. ముకేశ్ అంబానీ: 38 బిలియన్ డాలర్లు

2. అజీమ్ ప్రేమ్‌జీ: 19 బిలియన్ డాలర్లు

3. హిందుజా సోదరులు: 18.4 బిలియన్ డాలర్లు

4. లక్ష్మీ మిట్టల్: 16.5 బిలియన్ డాలర్లు

5. పల్లోంజి మిస్త్రీ: 16 బిలియన్ డాలర్లు

6. గోడ్రేజ్ ఫ్యామిలీ: 14.2 బిలియన్ డాలర్లు

7. శివ్ నాడార్: 13.6 బిలియన్ డాలర్లు

8. కుమార బిర్లా: 12. 6 బిలియన్ డాలర్లు

9. దిలీప్ సంఘ్వీ: 12.1 బిలియన్ డాలర్లు

10. గౌతమ్ అదానీ: 11 బిలియన్ డాలర్లు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.