యాప్నగరం

గుడ్ న్యూస్: నగదు విత్ డ్రా‌పై పరిమితి ఎత్తివేత

కొద్ది కొద్దిగా కరెన్సీ కష్టాలను తొలగిస్తోన్న రిజర్వ్ బ్యాంక్ మరి కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో కష్టాలను తొలగించనుంది.

TNN 8 Feb 2017, 3:30 pm
నోట్ల రద్దు ఫలితంగా ఏర్పడిన కష్టాల నుంచి ప్రజలకు కొద్ది కొద్దిగా ఉపశమనం కలిగిస్తోన్న రిజర్వ్ బ్యాంక్ తాజాగా మరో ముందడుగేసింది. కరెన్సీ విత్ డ్రా పరిమితిని వారానికి రూ. 50 వేలకు పెంచింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. మార్చి 13 నుంచి నగదు విత్ డ్రాపై పరిమితిని పూర్తి స్థాయిలో ఎత్తివేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ప్రస్తుతం వారంలో గరిష్టంగా రూ.24 వేలను మాత్రమే విత్ డ్రా చేసుకునే సౌలభ్యం ఉంది. జనవరి 27 నాటికి రూ. 9.92 లక్షల కోట్ల విలువైన కొత్త రూ.500, రూ.2000 నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ఏటీఎం ద్వారా నగదు విత్ డ్రాపై పరిమితి విషయమై మాత్రం రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
Samayam Telugu from 13 march there will be no limit on cash withdrawal from savings bank accounts rbi
గుడ్ న్యూస్: నగదు విత్ డ్రా‌పై పరిమితి ఎత్తివేత


ఏటీఎంల ద్వారా నగదు విత్ డ్రా పరిమితిని రూ.2,500 నుంచి రూ.4,500కు పెంచుతూ జనవరి 1న రిజర్వ్ బ్యాంక్ ఇండియా నిర్ణయం తీసుకుంది. తర్వాత దాన్ని రూ.10 వేలకు పొడిగించింది. ఇప్పటికే కరెంట్ అకౌంట్ ద్వారా నగదు విత్ డ్రా విషయంలో ఆర్‌బీఐ ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే. రూ.50వేల నుంచి రూ. లక్ష వరకూ ఈ పరిమితిని గతంలోనే ఆర్‌బీఐ పెంచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.