యాప్నగరం

మస్క్, మమ్మల్ని నియమించుకోండి.. ట్విటర్‌కు పెరుగుతోన్న జాబ్ అప్లికేషన్లు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్‌కు క్రేజ్ పెరిగిపోయింది. ఎలన్ మస్క్ చేతిలో ఈ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన తర్వాత.. ఆయన అభిమానులు ఈ సంస్థలో చేరేందుకు ఇష్టపడుతున్నారు. ఎంఐటీ రీసెర్చ్ సైటింస్ట్ నుంచి యాక్టర్ వరకు పలువురు తమ ట్వీట్ల ద్వారానే ట్విటర్‌లో చేరే తమ కోరికను ఎలన్ మస్క్‌కు విన్నపించుకున్నారు. ఎంఐటీ సైంటిస్ట్ అయితే ఏకంగా చీఫ్ లవ్ ఆఫీసర్‌గా ట్విటర్‌లో చేరతానంటూ తన దరఖాస్తును పెట్టుకున్నాడు.

Authored byKoteru Sravani | Samayam Telugu 2 May 2022, 6:56 pm

ప్రధానాంశాలు:

  • ట్విటర్‌లో సమూల మార్పులు
  • ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మస్క్
  • హైర్ మీ, మస్క్ అంటూ పెరుగుతోన్న అభ్యర్థనలు
  • నాయకత్వంలో మార్పులు ఉండే అవకాశం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Elon Musk
44 బిలియన్ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన ఎలన్ ‌మస్క్.. ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారారు. ఆయన చేస్తోన్న ప్రకటనలు ప్రతి ఒక్కర్ని ఆకర్షిస్తున్నాయి. ట్విటర్‌లో సమూల మార్పులకు కంకణం కట్టుకున్నారు ఎలన్ మస్క్. ఆయన అభిమానులు కూడా మస్క్‌తో కలిసి పనిచేయాలని తహతలాడుతున్నారు. నేరుగా ట్విటర్‌ ప్లాట్‌ఫామ్‌పైనే తమ దరఖాస్తులను పెట్టుకుంటున్నారు. అప్లికేషన్ పెట్టుకుంటోన్న వారిలో ‘స్టార్ ట్రెక్’ స్టార్ విలియం షాట్నర్ నుంచి ఎంఐటీ సైంటిస్ట్ వరకు ఉన్నారు. ‘హైర్ మీ, మస్క్!’ అంటూ తమ అభ్యర్థులను ట్విటర్ ద్వారా పంపిస్తున్నారు.
ఎలన్ మస్క్ నన్ను ట్విటర్‌లో నియమించుకోండి. తాను పదకొండేళ్లుగా సోషల్ యాప్స్‌ను రూపొందిస్తున్నానంటూ ఓ యూజర్ ట్వీట్ చేశాడు. అలాగే మస్క్‌కు ఎంఐటీ నుంచి కూడా ఓ రీసెర్చ్ సైంటిస్టు నుంచి కూడా జాబ్ రెజ్యూమె వచ్చింది. ట్విటర్‌లో చీఫ్ లవ్ ఆఫీసర్(సీఎల్ఓ) పోస్టుకు తాను దరఖాస్తు చేసుకుంటున్నట్టు పేర్కొని బిలీనియర్ మనసు చూరగొనేలా ప్రయత్నించాడు ఎంఐటీ సైంటిస్ట్ లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్. ‘ట్విటర్‌లో చీఫ్ లవ్ ఆఫీసర్(సీఎల్ఓ) పోస్టుకి నేను జాబ్ అప్లికేషన్‌ను పెట్టుకుంటున్నాను. నెలవారీ 69 డాలర్ల వేతనం ఇస్తే చాలు. అది కూడా క్రిప్టోలో చెల్లించండి. ఫలితంగా నేను నా వంతు ప్రయత్నం చేసి, ప్రపంచంలో ప్రేమను పెంచేందుకు కృషి చేస్తాను’ అంటూ ఎంఐటీ సైంటిస్ట్ ట్వీట్ ద్వారా తన దరఖాస్తును పెట్టుకున్నాడు.






Also Read : దేశంలోనే తొలి సెమీకండక్టర్ ప్లాంట్.. రూ.23 వేల కోట్ల పెట్టుబడి, భారీగా ఉద్యోగాలు
ఎలన్ మస్క్ స్నేహితుడు, ఇండియన్ టెకీ ప్రణయ పాథోలే కూడా ట్విటర్ కొనుగోలుపై ట్వీట్ చేశాడు. ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయడం ఎంతో ఉత్తమమైన నిర్ణయమని, ఈ ప్లాట్‌ఫామ్‌పై మనం వాక్ స్వాతంత్య్రం పొందుతామని అన్నాడు. ఈ ప్లాట్‌ఫామ్‌ను మెరుగైన విధంగా తీర్చిదిద్దేందుకు ఎలన్ మస్క్ ఎన్నో ప్రణాళికలు చేసుకున్నారని, వీటి వల్ల సానకూలమైన మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎలన్ మస్క్ మానవీయతకు సాయం చేస్తారని అన్నాడు.

అయితే ట్విటర్‌ను కొనుగోలు చేసే సమయంలో.. బ్యాంకర్లతో సమావేశమైన మస్క్.. ఈ సోషల్ మీడియా కంపెనీ నికర ఆదాయంపై ఫోకస్ చేయనున్నట్టు చెప్పారు. ఖర్చులను అదుపులోకి తెచ్చేందుకు ఉద్యోగాలకు కోత పెట్టేలా పలు ప్రతిపాదనలను తీసుకొచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపారు. ట్విటర్ నాయకత్వ టీమ్‌పై ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది అస్పష్టంగా ఉంది.

రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మస్క్ కంపెనీ నాయకత్వంపై తనకు ఎలాంటి నమ్మకం లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ట్విటర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌ పోస్టుకి ఎసరు పెట్టాయి. ట్విటర్ సీఈవో పరాగ్‌ను తప్పిస్తారని తెలుస్తోంది. అదేవిధంగా కంపెనీ పాలసీ, లీగల్ టీమ్‌కు ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న విజయ గద్దె పదవిపై కూడా నీలినీడలు అలుముకున్నాయి.

Also Read : అనుష్క నా మండే మోటివేషన్.. ఆనంద్ మహింద్రా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.