యాప్నగరం

New Tax Rules April 1: ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు.. వీటికి వర్తింపు!

ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ఖాతా బదిలీకి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదు. ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. అలాగే టూవీలర్లకు కొత్త ఏబీఎస్, సీబీఎస్ నిబంధనలు అమలులోకి రానున్నాయి.

Samayam Telugu 19 Mar 2019, 3:46 pm

ప్రధానాంశాలు:

  • పాన్ కార్డు, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, టూవీలర్లు.. ఇలా పలు అంశాలకు కొత్త నిబంధనలు అమలులోకి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu APRIL 1
కొత్త ఆర్థిక సంవత్సరం దగ్గరకు వస్తోంది. 2019 ఏప్రిల్ 1 నుంచి చాలా అంశాలు మారబోతున్నాయి. పాన్ దగ్గరి నుంచి స్టాక్ మార్కెట్ షేర్ల వరకు కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..
✺ పాన్, ఆధార్ లింక్‌ను మార్చి 31లోగా పూర్తిచేసుకోవాలి. లేకపోతే పాన్ కార్డు పనిచేయకుండాపోయే ప్రమాదముంది. అలాగే పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ కూడా దాఖలు చేయలేరు.

✺ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఇన్వెస్టర్లు చెల్లాంచే టోటల్ ఎక్స్‌పెన్స్ రేషియో (టీఈఆర్) నిబంధనలు మారనున్నాయి. ఈక్విటీ స్కీమ్స్ మినహా ఇతర స్కీ్మ్స్‌కు టీఈఆర్ 1 శాతంగా ఉండనుంది. క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్‌కు ఇది 2.25 శాతం ఉంటుంది. ఇతర స్కీమ్స్‌కు టీఈఆర్ 2.25 శాతంగా ఉండబోతోంది.

✺ ఫిజికల్ ఫామ్‌లో ఉన్న షేర్లను డీమెటీరియలైజ్ చేసుకోవాలి. ఏప్రిల్ 1 నుంచి షేర్లను కేవలం డీమ్యాట్ రూపంలోనే కలిగి ఉండాలి. డీమెటీరియలైజ్ అంటే సర్టిఫికెట్ల రూపంలో ఉన్న షేర్లను ఎలక్ట్రానిక్‌ రూపంలో మార్చుకోవడమే.

✺ అన్ని బ్యాంకులు రుణ రేట్లను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లతో అనుసంధానం చేయాలి. ఎస్‌బీఐ ఇప్పటికే ఈ పని పూర్తి చేసింది. దీంతో కన్సూమర్లపై రుణ భారం కొంతమేర తగ్గనుంది.

✺ అందుబాటు గృహ విభాగంపై జీఎస్‌టీ రేటు 1 శాతానికి దిగిరానుంది. ఇతర విభాగాలకు ఇది 5 శాతంగా ఉంటుంది. ప్రస్తుతం వీటిపై జీఎస్‌టీ రేటు వరుసగా 8 శాతంగా, 12 శాతంగా ఉంది.

✺ ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ ఖాతా బదిలీకి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదు. ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది.

✺ టూవీలర్లకు ఏబీఎస్, సీబీఎస్ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచే అమలులోకి రానున్నాయి. 125 సీసీ, ఆపై ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్స్‌కు ఏబీఎస్ తప్పనిసరి. ఇక 125 సీసీ సామర్థ్యంలోపు ఇంజిన్ కలిగిన బైక్స్‌కు సీబీఎస్ ఉండాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.