యాప్నగరం

గ‌రీబ్ ర‌థ్ టికెట్ చార్జీ పెంపు!

పేద‌ల‌కు త‌క్కువ ధ‌ర‌లో ఏసీ ప్ర‌యాణాన్ని అందించే గరీబ్‌ రథ్‌ ఎక్స్‌ప్రెస్ చార్జీలూ భారం కానున్నాయి

Samayam Telugu 16 Jul 2018, 10:01 am
పేద‌ల‌కు త‌క్కువ ధ‌ర‌లో ఏసీ ప్ర‌యాణాన్ని అందించే గరీబ్‌ రథ్‌ ఎక్స్‌ప్రెస్ చార్జీలూ భారం కానున్నాయి. గత కొన్నేళ్లుగా లినెన్‌ ధర పెరిగినప్పటికీ గరీబ్‌ రథ్‌ రైళ్లలో ప్రయాణీకులకు అందించే దుప్పట్ల ధరను టికెట్‌ రేటులో కలపలేదు. అయితే తాజాగా ఈ ధరల భారాన్ని గరీబ్‌ రథ్‌ చార్జీలను పెంచడం ద్వారా కొంతమేర భర్తీ చేయాలని భావిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. పదేళ్ల కిందట రూ 25గా నిర్ణయించిన బెడ్ రోల్ ధరను సవరించాలని రైల్వేలు నిర్ణయించాయి.
Samayam Telugu garib rath
గరీబ్‌ రథ్‌ ఎక్స్‌ప్రెస్


10 సంవ‌త్స‌రాల నుంచి బెడ్‌రోల్‌ ధరలను ఎందుకు మార్చ‌లేద‌ని ప్ర‌శ్నించి.. గ‌రీబ్ ర‌థ్ రైళ్లన్నింటిలో టిక్కెట్ చార్జీల్లో వీటిలో క‌ల‌పాల‌ని కాగ్‌ కోరిన మీదట ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని చెప్పారు. బెడ్‌రోల్‌ ధరలు టికెట్‌ ధరలో కలపితే రానున్న కొద్ది నెలల్లో గ‌రీబ్ ర‌థ్ రైలు ప్ర‌యాణ చార్జీలు కొంతమేర పెరుగుతాయని వెల్లడించారు.

బెడ్‌రోల్‌ కిట్స్‌ టికెట్‌తో పాటే ప్రస్తుతం ఉచితంగా ఆఫర్‌ చేస్తుండగా, ఇక వీటి ధరలనూ టికెట్‌లో కలుపుతామని అధికారులు సంకేతాలు పంపారు. కాగ్‌ సూచనలతో పేద, సాధారణ ప్రయాణీకులు ఎంచుకునే గరీబ్‌ రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణీకుల పైనా చార్జీల వడ్డన తప్పేలా లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.