యాప్నగరం

Gautam Adani: ప్రపంచ కుబేరుడిగా అదానీ నెం.2.. మిగిలింది ఒకే ఒక్క అడుగు!

Gautam Adani: గౌతమ్ అదానీ అనుకున్నది సాధించేశారు. కనీసం రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి కూడా దక్కని, ఎంతో మంది ప్రపంచ బిలీనియర్స్ పోటీ పడే దక్కించుకునే స్థానాన్ని గౌతమ్ అదానీ కొట్టేశారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టి మరి.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కుబేరుడిగా నిలిచారు. ఇక ప్రపంచ కుబేరుడిగా మారడానికి ఒకే ఒక్క అడుగు మిగిలి ఉంది. అదానీ గ్రూప్ స్టాక్స్ దూసుకెళ్తుండటంతో.. అదానీ ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. త్వరలోనే ప్రపంచ కుబేరుడిగా అదానీ అవతరించిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

Authored byKoteru Sravani | Samayam Telugu 16 Sep 2022, 2:24 pm

ప్రధానాంశాలు:

  • రెండో ప్రపంచ కుబేరుడిగా గౌతమ్ అదానీ
  • జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టిన అదానీ కంపెనీల అధినేత
  • నాలుగో స్థానానికి పడిపోయిన అమెజాన్ ఫౌండర్
  • ఫోర్బ్స్ టాప్ 10 జాబితాలో అదానీ, అంబానీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Gautam Adani is now world second richest person
రెండో ప్రపంచ కుబేరుడిగా గౌతమ్ అదానీ
Gautam Adani: అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అనుకున్నది సాధించేశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కుబేరుడిగా గౌతమ్ అదానీ నిలిచారు. అమెజాన్ జెఫ్ బెజోస్, ఫ్రాన్స్ బెర్నార్డ్ ఆర్నాల్ట్‌లను దాటేసి.. గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలీనియర్స్ జాబితాలో ఈ విషయం వెల్లడైంది. గౌతమ్ అదానీ సంపద ప్రస్తుతం 155.7 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ అంచనావేసింది. భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం.. ఈ సంపద రూ.12,42,898 కోట్లు. ప్రపంచ కుబేరుడిగా గౌతమ్ అదానీ అవతరించడానికి ఇంకా ఒక్క స్థానమే మిగిలి ఉంది. ప్రస్తుతం ప్రపంచ కుబేరుడిగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఉన్నారు. ఆయన సంపద 273.5 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ పేర్కొంది.
ఫోర్బ్స్ విడుదల చేసిన డేటాలో.. అదానీ సంపద శుక్రవారం ఒక్క రోజే 5.5 బిలియన్ డాలర్లు పెరిగింది. అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా ర్యాలీ చేస్తుండటంతో గౌతమ్ అదానీ సంపద కూడా ఉవ్వెత్తున ఎగిసింది. దలాల్ స్ట్రీట్‌లో లిస్టయిన అదానీ గ్రూప్ స్టాక్స్‌లో ఏడు స్టాక్స్ నేడు లాభాల జోరులో దూసుకెళ్తున్నాయి.

లగ్జరీ గూడ్స్ కంపెనీ ఎల్‌వీఎంహెచ్(LVMH) అధినేత అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో ధనికుడిగా నిలిచారు. ఈయన కుటుంబ నికర సంపద సుమారు 155.2 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఫోర్బ్స్ తెలిపింది. అదానీ వెనక్కి నెట్టేసిన అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ప్రస్తుతం నాలుగో స్థానానికి పడిపోయారు. ఈయన సంపద 149.7 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది.

Also Read : ఏడాది క్రితం రూ.5 షేరే.. ఇన్వెస్టర్లన్ని కోటీశ్వరుల్ని చేసింది

అదానీ గ్రూప్ స్టాక్స్(Adani Group stocks) అన్నింటి మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం రూ.20.11 లక్షల కోట్లుగా నమోదైంది. ఈ క్యాలెండర్ ఇయర్‌లో అదానీ గ్రూప్ స్టాక్స్‌లో నాలుగు కంపెనీలు రెండింతలకు పైగా పెరిగాయి. ఫోర్బ్స్ విడుదల చేసిన రియల్ టైమ్ బిలీనియర్స్ జాబితాలో టాప్ 10లో బిల్ గేట్స్(105.3 బిలియన్ డాలర్లు), వారెన్ బఫెట్(96.5 బిలియన్ డాలర్లు), ముకేశ్ అంబానీ(92.6 బిలియన్ డాలర్లు), గూగుల్ కో ఫౌండర్లు ల్యారీ పేజ్(89 బిలియన్ డాలర్లు), సెర్జి బ్రిన్(85.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు.

అయితే బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ గురువారం విడుదల చేసిన డేటాలో అదానీ నెంబర్.3 స్థానంలోనే ఉన్నారు. కానీ ఆయన సంపద శుక్రవారం భారీగా పెరగడంతో నెంబర్ 2 స్థానంలోకి వచ్చేశారు. ఈ క్యాలెండర్ ఇయర్‌లో అదానీ సంపద 72.4 బిలియన్ డాలర్ల వరకు ఎగిసింది. 2022లో టాప్ 10 బిలీనియర్స్ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరు భారతీయులుగా గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీలు నిలుస్తున్నారు.

Read latest Business News and Telugu News

Also Read : సెకండ్ హ్యాండ్ కార్లకు కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. దూసుకెళ్తోన్న మార్కెట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.