యాప్నగరం

నిమిషాల వ్యవధిలో పాన్ కార్డ్ మీ సొంతం

నిమిషాల వ్యవధిలోనే పాన్ కార్డు పొందొచ్చు. స్మార్ట్ ఫోన్‌తో కాసేపట్లోనే పాన్..

TNN 16 Feb 2017, 3:13 pm
మీకు పాన్ కార్డు లేదా? అప్లయ్ చేసినా పొందడానికి ఆలస్యం అవుతుందని భావిస్తున్నారా? అలాంటిందేం లేదు. ఇక మీదట మీరు నిమిషాల వ్యవధిలోనే పాన్ కార్డు పొందొచ్చు. స్మార్ట్ ఫోన్‌తో కాసేపట్లోనే పాన్ నంబర్‌ను పొందడం ఇక ఎంతో సులువు కానుంది. ఎలా అనుకుంటున్నారా? ఆదాయపన్ను విభాగం వేగంగా పాన్ జారీ చేయడం కోసం ఓ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి కాసేపట్లోనే పాన్ కార్డు పొందే వీలుంది. ప్రస్తుతం ఇది ప్రాథమిక దశలోనే ఉంది. ఈ యాప్ ద్వారా ఎంత పన్ను కట్టాల్సి ఉంటుందో తెలుసుకోవడంతోపాటు రిటర్నుల ప్రక్రియ ఎక్కడి దాకా వచ్చిందో కూడా తెలుసుకోవచ్చు. ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టనున్నారు.
Samayam Telugu get pan within minutes pay taxes via mobile app soon
నిమిషాల వ్యవధిలో పాన్ కార్డ్ మీ సొంతం


ఆధార్ ద్వారా వివరాలు పొంది.. పాన్ కార్డును, ఆదాయపన్ను మదింపును తెలిపేలా ప్రాజెక్టుకు ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం రూపకల్పన చేస్తోంది. మరింత మంది ప్రజలకు పాన్ కార్డు అందించేందుకు, పన్ను పరిధిలోకి మరింత మందిని తీసుకొచ్చేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటి దాకా ఏటా 2.5 కోట్ల మందికే పాన్ కార్డు అందిస్తుండగా.. 25 కోట్ల మందికి మాత్రమే పాన్ కార్డు ఉంది. రూ. 50 వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు విత్ డ్రా చేయడానికి పాన్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రూ. 2 లక్షలకు మించిన నగదు లావాదేవీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. జనవరి 1 నుంచి ఆదాయపన్ను విభాగం సరికొత్త డిజైన్‌, సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన పాన్ కార్డును ఇవ్వడం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.