యాప్నగరం

తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (19.01.18) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

TNN 19 Jan 2018, 7:29 am
త కొద్ది రోజులుగా హెచ్చు తగ్గులతో కొనసాగుతోన్న బంగారం, వెండి ధరలు నేడు (జనవరి 19న) స్వల్పంగా తగ్గాయి. డిసెంబర్ నెలతో పోల్చితే జనవరి 16న గరిష్ట ధరకు చేరిన బంగారం ధర.. ఇప్పుడు మళ్లీ కిందకు వస్తోంది. గురువారం (జనవరి 18)తో పోలిస్తే నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.210 తగ్గింది. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.28,830గా ఉండగా.. నేడు రూ.28,620కి చేరింది. మరోవైపు కిలో వెండి ధరపై రూ.300 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు (జనవరి 19న) బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
Samayam Telugu gold and silver price in hyderabad
తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం, వెండి ధరలు


గమనిక: ఆన్‌లైన్‌లో కేవలం బంగారం ధర మాత్రమే తెలియజేస్తారు. దీనిలో మజూరి, తరుగు వంటి అదనపు ధరలు ఇమిడి ఉండవు.

(రోజూ బంగారం ధరల సమాచారం మొబైల్ అలెర్టులను పొందేందుకు సమయం తెలుగు యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి)

మార్కెట్లో నేటి బంగారం ధరలు (19-01-2018)

హైదరాబాద్
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.28,620
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.31,221

విజయవాడ
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.28,620
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.31,221

విశాఖపట్నం
22 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.28,620
24 క్యారట్ గోల్డ్ (10 గ్రా.) - రూ.31,221

వ్యత్యాసం: 18.01.2018న రూ.2,883గా ఉన్న 1 గ్రాము 22 క్యారట్ గోల్డ్ ధర.. 19.01.2018న రూ.2,862గా ఉంది. అంటే రూ.21 తగ్గింది.

వెండి
హైదరాబాద్ - 1 కేజీ సిల్వర్ - రూ.42,000
విశాఖపట్నం - 1 కేజీ సిల్వర్ - రూ.42,000
విజయవాడ - 1 కేజీ సిల్వర్ - రూ.42,000

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.