యాప్నగరం

మరింత పెరిగిన బంగారం ధర

కరెన్సీ కొరత తీరుతుండడంతో బంగారం ధర మళ్లీ మళ్లీ పైపైకి ఎగబాకుతోంది.

TNN 13 Jan 2017, 6:29 pm
బంగారం ధరలు కొన్ని రోజుల పాటూ తగ్గుముఖం పట్టి సామాన్యుడి కోసం దిగొచ్చేలా కనిపించాయి. కరెన్సీ కొరత తీరుతుండడంతో బంగారం ధర మళ్లీ మళ్లీ పైపైకి ఎగబాకుతోంది. గత నెలన్నరలో గరిష్ట ధరకు పసిడి ధర చేరింది. పదిగ్రాముల ధర రూ.26వేల వరకు చేరిన ధర తరువాత కొంచెం కొంచెం పుంజుకుని పెరగడం ఆరంభించింది. శుక్రవారం పదిగ్రాముల ధర రూ.29,450కి చేరింది. రాబోయేది పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో ఇక ఇప్పట్లో బంగారం ధర తగ్గే అవకాశం లేదంటున్నారు నిపుణులు. ఇక వెండి ధర మాత్రం తగ్గింది. రూ.300 క్షీణించి రూ.40,950గా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.