యాప్నగరం

ఏడాది చివరి రోజున తగ్గిన బంగారం ధర!!

పదకొండు నెలల కనిష్టానికి చేరుకుని వరుసగా నాలుగు రోజుల పాటు పెరిగిన పసిడి ధరలకు కళ్లెం పడింది. 2016 ఏడాది చివరి రోజున పుత్తడి ధరలు ఒక్కసారిగా తగ్గాయి.

TNN 31 Dec 2016, 6:30 pm
పదకొండు నెలల కనిష్టానికి చేరుకుని వరుసగా నాలుగు రోజుల పాటు పెరిగిన పసిడి ధరలకు కళ్లెం పడింది. 2016 ఏడాది చివరి రోజున పుత్తడి ధరలు ఒక్కసారిగా తగ్గాయి. 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర రూ.200 తగ్గి రూ.28,300కు చేరుకుంది. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో ధరలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Samayam Telugu gold slumps to low of rs 28300 per 10 gm on weak demand
ఏడాది చివరి రోజున తగ్గిన బంగారం ధర!!


మరో పక్క వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.39,000లకు చేరుకుంది. నాణేల తయారీదారులు, పరిశ్రమ వర్గాలు కోనుగోళ్లకు ఆసక్తి చూపకపోవడంతో ధరలు తగ్గినట్లు బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది నవంబరు 9 న 10 గ్రాముల బంగారం ధర గరిష్ఠంగా రూ.31,750 చేరి తర్వాత మెల్లగా తగ్గుతూ వచ్చింది. నోట్ల రద్దుతో కొనుగోళ్లు మందగించడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా పరిణామాలు చోటు చేసుకోవడంతో బంగారం ధరలు తగ్గినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 2016 జనవరి 1 న పది గ్రాముల బంగారం ధర రూ.25,390 పలికింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.