యాప్నగరం

ప్రభుత్వానికి రూ.లక్ష కోట్లకు పైగా ఆదా

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో ప్రభుత్వం రూ.7.33 లక్షల కోట్లను లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమచేసింది. దేశంలో ప్రస్తుతం 439 సబ్సిడీ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.

Samayam Telugu 10 Jun 2019, 4:23 pm

ప్రధానాంశాలు:

  • ప్రత్యక్ష నగదు బదిలీ స్కీమ్ ఇందుకు కారణం
  • ఈ పథకంతో లబ్ధిదారుల అకౌంట్‌కే డైరెక్ట్‌గా డబ్బులు
  • దీంతో అవినీతికి చెక్

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu GOVT
డబ్బులు ఆదా చేయడం అంత సులువైన విషయం కాదు. ఒక చోటు ఆదా చేశామని ఊపిరి పీల్చుకునేలోపు మరొక ఖర్చు వచ్చి ఆ సేవింగ్స్‌ను ఖాళీ చేసేస్తుంది. అందుకే డబ్బు పొదుపు చేయడం కూడా గొప్ప విషయమే.
కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.1.14 లక్ష కోట్లకు పైగా ఆదా చేసింది. అది ఎలా అనుకుంటున్నారా? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) స్కీమ్ ఇందుకు కారణం. ఇందులో సబ్సిడీ ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా చేరుతాయి.

2019 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లను ఆదా చేసింది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని 2013 జనవరిలో ప్రారంభించింది. ఇందులో లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తం డైరెక్ట్‌గా వారి బ్యాంక్ అకౌంట్లలోనే పడిపోతుంది. దీంతో అక్రమార్కులకు, అవినీతికి అడ్డుకట్ట పడింది.

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో ప్రభుత్వం రూ.7.33 లక్షల కోట్లను లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమచేసింది. దేశంలో ప్రస్తుతం 439 సబ్సిడీ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. 2018-19లో దాదాపు 59 కోట్ల మందికి ప్రయోజనం చేకూరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.