యాప్నగరం

పెట్రోల్ బాంబ్: రోజు రోజుకీ పైపైకి!

‘‘కార్లు ఉన్నవాళ్లే పెట్రోలు పోయించుకుంటారు. వాళ్ల దగ్గర డబ్బుల్లేవా? వాళ్లేం ఆకలితో అలమటించడం లేదు కదా!’’ అని ఓ కేంద్ర మంత్రి ఆల్ఫాన్స్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు నిజం చేస్తున్నారు. మరి, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎడ్ల బండ్లపై రాకపోకలు చేయాలా? మహాశయా?

TNN 17 Jan 2018, 9:16 am
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుకూలంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో రోజువారీ మార్పుల వల్ల సామాన్యుడు నిలువు దోపిడీకి గురవ్వుతున్నాడు. ఇందుకు గత కొద్ది రోజులుగా పెరుగుతోన్న పెట్రోల్, డీజిల్ ధరలే కారణం. ఈ ఊపు చూస్తుంటే.. పెట్రోల్ ధర లీటరు రూ.100 దాటినా ఆశ్చర్యపోవక్కర్లేదు. రోజుకో పైసా చొప్పున ఏకంగా రూపాయల్లో పెరుగుతున్న ధరలను ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేస్తూ.. సామాన్యుడి నడ్డి విరుస్తోంది.
Samayam Telugu govt hikes petrol diesel price to cope with higher crude
పెట్రోల్ బాంబ్: రోజు రోజుకీ పైపైకి!


ఒకప్పుడు పైసల్లో ధర పెరిగితేనే నిరసనలు వ్యక్తమయ్యేవి. కానీ, ఇప్పుడు 45 రోజుల్లోనే రూ.6 నుంచి రూ.7లకు ధరలు పెరిగినా ప్రశ్నించేవారే లేకపోవడం ప్రభుత్వానికి, ఇంధన సంస్థలు బిందాస్‌గా ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నాయి. సామాన్యుడి గోడుపట్టని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల భారాన్ని మోపుతున్నాయి. ఈ నెల 13న ఒకేసారి 28 పైసలు పెంచారు. ఆ తర్వాత క్రమేనా పైసా పైసా పెంచుకుంటూ వచ్చారు.

15 నెలల్లోనే పెట్రోలుపై లీటరుకు రూ.11.77, డీజిల్‌పై 13.47 చొప్పున ధర పెంచారు. 2014-15లో ఎక్సైజ్‌ సుంకం రూపంలో కేంద్రం రూ.99 వేల కోట్లు సంపాదించగా 2016-17లో అది రూ.2.42 లక్షల చేరిందంటే ఏ స్థాయిలో బాదేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలు వ్యాట్‌ను వెనక్కి తీసుకోకపోవడంతో దేశంలోనే అత్యధిక ఛార్జీలు ఇక్కడ అమలవుతున్నాయి.

బుధవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.75.59 ఉండగా, డీజిల్ ధర రూ.67.43 ఉంది. అయితే, విజయవాడలో ఈ ధర ఏకంగా రూ.76.92కు చేరింది. అంటే లీటర్ పెట్రోల్ దాదాపు రూ.77 (చిల్లర తిరిగి ఇవ్వరు కాబట్టి). డీజిల్ ధర కూడా 68.79కు చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగే పెరుగుతూ పోతే.. రానున్న రోజుల్లో నిత్యవసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. మరి, ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల గోడు వింటుందో లేదో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.