యాప్నగరం

లోన్ తీసుకునే వారికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరిపోయే శుభవార్త!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు అందించింది. ఆకర్షణీయ వడ్డీ రేట్లకే రుణాలు అందిస్తోంది. ఇంకా పలు రకాల ప్రయోజనాలు కల్పిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు వంటివి పొందొచ్చు.

Samayam Telugu 26 Oct 2021, 11:35 am

ప్రధానాంశాలు:

  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ శుభవార్త
  • ఆకర్షణీయ వడ్డీ రేట్లు
  • పలు ప్రయోజనాలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu hdfc bank
పండుగ సీజన్‌లో కారు కొనేందుకు రెడీ అవుతున్నారా? లేదంటే బైక్, స్కూటర్ వంటివి కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? ఇవీ కాకపోతే సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తున్నారా? వీటి కోసం బ్యాంక్ నుంచి రుణం పొందాలని ప్లాన్ చేస్తున్నారా?
అయితే మీకు శుభవార్త. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు అదిరే ఆఫర్లు అందుబాటులో ఉంచింది. వివిధ రకాలపై పలు రకాల ఆఫర్లు అందిస్తోంది. పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ వంటివి కూడా పొందే ఛాన్స్ ఉంది.

Also Read: undefined

కారు రుణాలు 7.5 శాతం వడ్డీ రేటుకే పొందొచ్చు. జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ ఉంది. 100 శాతం ఫైనాన్స్ పొందొచ్చు. హోమ్ లోన్ పొందాలని భావించే వారికి వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. స్పెషల్ ప్రాసెసింగ్ ఫీజు ప్రయోజనం పొందొచ్చు.

టూవీలర్ లోన్ కావాలని భావించే వారికి వడ్డీ రేటులో 4 శాతం తగ్గింపు లభిస్తోంది. ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు పొందొచ్చు. పర్సనల్ లోన్ తీసుకోవాలని భావించే వారికి వడ్డీ రేటు 10.25 శాతంగా ఉంటుంది. గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేటు 9.9 శాతం నుంచి ప్రారంభమౌతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.