యాప్నగరం

హెచ్‌డీఎఫ్‌సీ Home Loan ఆఫర్ అదిరింది.. తక్కువ వడ్డీకే రుణాలు!

హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే శుభవార్త. దిగ్గజ ఫైనాన్షియల్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ల కోసం సూపర్ ఆఫర్ అందిస్తోంది. హోమ్ లోన్ కార్నివాల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆకర్షణీయ వడ్డీ రేటుకే హోమ్ లోన్ పొందొచ్చు.

Samayam Telugu 24 Jan 2020, 4:45 pm
హోమ్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే శుభవార్త. దిగ్గజ ఫైనాన్షియల్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్ల కోసం సూపర్ ఆఫర్ అందిస్తోంది. హోమ్ లోన్ కార్నివాల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆకర్షణీయ వడ్డీ రేటుకే హోమ్ లోన్ పొందొచ్చు.
Samayam Telugu hdfc home loan carnival apply for loan at attractive interest rates
హెచ్‌డీఎఫ్‌సీ Home Loan ఆఫర్ అదిరింది.. తక్కువ వడ్డీకే రుణాలు!


8 శాతం నుంచి

హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్స్‌పై ఇప్పుడు వడ్డీ రేటు 8 శాతం నుంచి ప్రారంభమౌతోంది. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని కంపెనీ పేర్కొంది. అయితే నిర్దిష్టమైన తేదీ అంటూ ఏమీ పేర్కొనలేదు. అంటే ఆఫర్‌ను కంపెనీ ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు.

Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండి మరింత పతనం!

లోన్ బెనిఫిట్స్

హెచ్‌డీఎఫ్‌సీ తన హోమ్ లోన్స్‌పై కస్టమర్లకు పలు ప్రయోజనాల్ని అందిస్తోంది. ఈజీ డాక్యుమెంటేషన్, డోర్‌స్టెప్ అసిస్టెన్స్, క్విక్ అండ్ ఈజీ ప్రాసెసింగ్, కస్టమైజ్డ్ రీపేమెంట్ ఆప్షన్స్, నో హిడెన్ చార్జీలు వంటి ప్రత్యేకతలు ఉంటాయని వివరించింది.

Also Read: LIC కస్టమర్లకు షాక్.. జనవరి 31 నుంచి ఆ 23 పాలసీలు రద్దు!

ఆన్‌లైన్‌లోనే అప్లై

ఇకపోతే హెచ్‌డీఎఫ్‌సీ హోమ్ లోన్ తీసుకోవాలని భావించే వారు డైరెక్ట్‌‌గా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.hdfc.com/homeloancarnival2019 ఈ లింక్ సాయంతో నేరుగా లోన్ కోసం అప్లై చేసుకుంటే సరిపోతుంది.

Also Read: PF ఖాతాదారులు, ఉద్యోగులకు శుభవార్త.. కొత్త సర్వీసులు అందుబాటులోకి.. ఇక కంపెనీల చుట్టూ తిరగాల్సిన పని లేదు!

వడ్డీ రేట్లు ఇలా

మహిళలు హోమ్ ‌లోన్‌ తీసుకుంటే.. రూ.30 లక్షల వరకు రుణానికి 8 శాతం నుంచి 8.5 శాతం వరకు వడ్డీ పడుతుంది. అదే ఇతరులకు కూడా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుంది. రూ.30.01 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు రుణంపై 8.25 నుంచి 8.75 శాతం వరకు వడ్డీ పడుతుంది. అదే రూ.75.01 లక్షల నుంచి ఆపైన మొత్తానికి వడ్డీ రేటు 8.3 నుంచి రూ.8.8 శాతం మధ్యలో ఉంది.

Also Read: కారు/ బైక్ కొంటున్నారా.. వారం రోజులు ఆగితే మీకు పండగే!?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.