యాప్నగరం

Credit Cardsతో ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించడం ఎలా? పూర్తి వివరాలు!

దేశీ దిగ్గజ బీమా కంపెనీ ఎల్‌ఐసీ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కన్వీనియన్స్ ఫీజును తొలగిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. పాలసీ రెన్యూవల్ ప్రీమియం, కొత్త ప్రీమియం, లోన్ రీపేమెంట్, లోన్స్‌పై వడ్డీ చెల్లింపు వంటి క్రెడిట్ కార్డు పేమెంట్స్‌కు అదనపు చార్జీలు పడవు.

Samayam Telugu 7 Dec 2019, 12:57 pm
దేశీ దిగ్గజ బీమా కంపెనీ ఎల్‌ఐసీ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కన్వీనియన్స్ ఫీజును తొలగిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. పాలసీ రెన్యూవల్ ప్రీమియం, కొత్త ప్రీమియం, లోన్ రీపేమెంట్, లోన్స్‌పై వడ్డీ చెల్లింపు వంటి క్రెడిట్ కార్డు పేమెంట్స్‌కు అదనపు చార్జీలు పడవు.
Samayam Telugu here is how to pay your lic premium via credit card
Credit Cardsతో ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించడం ఎలా? పూర్తి వివరాలు!


అదనపు చార్జీలు ఉండవు

క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించే పేమెంట్స్‌పై ఎలాంటి చార్జీలు పడవని ఎల్ఐసీ తెలిపింది. అన్ని ప్లాట్‌ఫామ్స్‌కు ఈ నిర్ణయాన్ని వర్తింప జేస్తామని పేర్కొంది. కార్డ్‌లెస్ పేమెంట్స్, కార్డ్ స్వైప్, పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్స్ (పీఓఎస్) వంటి అన్ని చోట్ల కార్డు ద్వారా జరిపే చెల్లింపులకు ఎలాంటి చార్జీలు ఉండవని వివరించింది.

Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. వెండిదీ ఇదే దారి!

క్రెడిట్ కార్డుతో ఎల్ఐసీ ప్రీమియం ఎలా చెల్లించాలో చూద్దాం..

Also Read: శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధర.. ఈసారి ఎంతంటే?

ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. పే ప్రీమియం ఆన్‌లైన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

Also Read: ఎస్‌బీఐ శుభవార్త.. లోన్ తీసుకుంటే అదిరిపోయే ఆఫర్లు.. ఏకంగా 50 శాతం డిస్కౌంట్!

ఇప్పుడు కొత్ పేజ్ ఓపెన్ అవుతుంది. రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. పే డైరెక్ట్, త్రూ కస్టమర్ పోర్టల్ అనేవి రెండు ఆప్షన్లు.

Also Read: Credit Score లేకుండానే రూ.5,000 నుంచి రూ.5 లక్షల వరకు రుణం!

పే డైరెక్ట్ ఆప్షన్ ఎంచుకుంటే మరో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎందుకు డబ్బులు చెల్లిస్తారో ఎంచుకోవాలి. పాలసీ రెన్యూవల్/రివైవల్, అడ్వాన్స్ పేమెంట్, లోన్ పేమెంట్, వడ్డీ చెల్లింపు వంటి ఆప్షన్లు ఉంటాయి. ఏదో ఒకటి ఎంచుకోవాలి.

ఇప్పుడు మరో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాలసీ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ప్రీమియం మొత్తం, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. సబ్‌మిట్ చేయాలి. పేమెంట్ ఆప్షన్‌లో క్రెడిట్ కార్డు ఎంచుకోవాలి.

ఇక కస్టమర్ పోర్టల్ ద్వారా అయితే మీ ఎల్ఐసీ అకౌంట్‌తో లాగిన్ అవ్వాలి. తర్వాత ప్రీమియం డబ్బులు చెల్లించాలి. అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోవచ్చు.

క్రెడిట్ కార్డుతో మాత్రమే కాకుండా నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు వంటి ఆప్షన్లతో కూడా ప్రీమియం చెల్లించొచ్చు.

ఎల్‌ఐసీ పోర్టల్ వద్దనుకుంటే ఎల్‌ఐసీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కూడా ఎల్‌ఐపీ ప్రీమియం మొత్తాన్ని చెల్లించొచ్చు. దీని కోసం గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి మైఎల్ఐసీ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.