యాప్నగరం

అదిరిపోయే ఆఫర్.. రూ.4,999 చెల్లించి బైక్, స్కూటర్ ఇంటికి తీసుకెళ్లొచ్చు.. ఇంకా రూ.7 వేల డిస్కౌంట్!

పండుగ సీజన్‌లో కొత్తగా బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. హీరో మోటొకార్ప్ కంపెనీ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది.

Samayam Telugu 5 Nov 2020, 9:52 am

ప్రధానాంశాలు:

  • టూవీలర్లపై అదిరే ఆఫర్లు
  • క్యాష్ డిస్కౌంట్లు
  • తక్కువ వడ్డీకే రుణాలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu hero offers
కొత్తగా బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. దేశీ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ అదిరిపోయే ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. పండుగ సీజన్‌లో టూవీలర్ కొనుగోలుపై బంపరాఫర్లు అందిస్తోంది. తక్కువ వడ్డీకే రుణం, క్యాష్ డిస్కౌంట్, తక్కువ డౌన్ పేమెంట్ వంటి సదుపాయాలు కల్పిస్తోంది.
స్ల్పెండర్ ప్లస్, సూపర్ స్ల్పెండర్, స్ల్పెండర్ ఐస్మార్ట్, హెచ్‌ఎఫ్‌ డీలక్స్, ప్యాషన్ ప్రో, గ్లామ్ వంటి బైక్స్‌పై తక్కువ డౌన్ పేమెంట్ ఆప్షన్ ఉంది. కేవలం రూ.4,999 చెల్లించి బైక్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. అదే మీరు లోన్ తీసుకొని బైక్ కొనుగోలు చేయాలని భావిస్తే.. వడ్డీ రేటు కూడా తక్కువగా 6.99 శాతంగా ఉంది.

Also Read: undefined

అంతేకాకుండా ఇంకా అదనంగా క్యాష్ బెనిఫిట్ కూడా పొందొచ్చు. రూ.3,100 వరకు తగ్గింపు లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ రూ.2,100 అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ టాపప్ కింద రూ.1,000 తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్లు రూ.125 సీసీ ఇంజిన్ వెహికల్స్‌కు మాత్రమే వర్తిస్తాయి.

ఇక హీరో స్కూటర్లు కొనుగోలు చేయాలని భావించే వారికి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇదే తక్కువ డౌన్ పేమెంట్ బెనిఫిట్ లభిస్తుంది. అలాగే రుణాలపై వడ్డీ రేటు కూడా 6.99 శాతంగానే ఉంది. అదే స్కూటర్ల విషయంలో క్యాష్ బెనిఫిట్ విషయానికి వస్తే ఏకంగా రూ.6,100 వరకు ప్రయోజనం పొందొచ్చు.

Also Read: undefined

ఇక హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్, ఎక్స్‌పల్స్ 200 వంటి బైక్స్‌పై కూడా తక్కువ డౌన్ పేమెంట్, తక్కువ వడ్డీ రేటు బెనిఫిట్స్ పొందొచ్చు. క్యాష్ బెనిఫిట్ రూ.7,000 వరకు లభిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.3,000, ఎక్స్చేంజ్ టాపప్ రూ.2,000, కార్పొరేట్ క్యాష్ ఆఫర్ రూ.2,000 కలిసి ఉంటాయి.

ఇంకా కస్టమర్లు రూ.499 చెల్లించి రూ.5,500 విలువైన సర్వీస్ ప్యాకేజీని పొందొచ్చు. ఇంకా పేటీఎం ద్వారా చెల్లిస్తే రూ.2,500 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. సిటీ బ్యాంక్ కార్డు వాడే వారికి రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డు, డెబిట్ కార్డు కస్టమర్లు ఈఎంఐ ఆప్షన్‌పై రూ.5,000 వకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.