యాప్నగరం

హీరో షాకింగ్ నిర్ణయం.. టూవీలర్ల తయారీ నిలిపివేత! ఎందుకంటే?

హీరో బైక్స్ తయారు చేస్తున్న హీరో మోటొకార్ప్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. వాహన తయారీని నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇది తాత్కాలికం మాత్రమే. తర్వాత మళ్లీ ప్రొడక్షన్ ఉంటుంది.

Samayam Telugu 21 Apr 2021, 2:01 pm

ప్రధానాంశాలు:

  • హీరో కీలక నిర్ణయం
  • తయారీ నిలుపుదల
  • కారణం ఇదే

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu hero
దేశీ అతిపెద్ద టూవీలర్ల తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని తయారీ ప్లాంట్లలోనూ వాహన తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ 19 కేసులు భారీగా పెరిగిపోతుండటం ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ తెలిపింది.
ఏప్రిల్ 22 నుంచి మే 1 వరకు ప్రతి ప్లాంటు క్లోజ్‌లోనే ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇలా ప్లాంటు క్లోజ్‌లో ఉన్న సమయంలో మెయింటెనెన్స్ పనులు పూర్తి చేసుకుంటామని తెలిపింది. ఇకపోతే కంపెనీకి చెందిన అన్ని కార్పొరేట్ ఆఫీస్‌లు క్లోజ్‌లోనే ఉన్నాయి. ఉద్యోగులు వర్క్ ఫ్రం మోమ్ చేస్తున్నారు.

కంపెనీ వాహన తయారీ నిలుపుదల కారణంగా డిమాండ్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని హీరో తెలిపింది. షట్ డౌన్ తర్వాత ప్రతి ప్లాంటులోనూ తయారీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమౌతాయని వివరించింది. కంపెనీకి గురుగ్రామ్, ధారుహెరా, హరిద్వార్, హలోల్, చిత్తూరు, నీమ్రానా వంటి ప్రాంతాల్లో తయారీ ప్లాంట్లులు ఉన్నాయి.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.