యాప్నగరం

Home Loan EMIs : ఇంటి రుణాలు తీసుకునే వారికి బ్యాడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న ఈఎంఐలు

కనిష్ట వడ్డీ రేట్లను ఇన్ని రోజులు ఆస్వాదించిన ప్రజలకు బ్యాడ్‌న్యూస్. కరోనా ముందటి స్థాయిలకు ఇక వడ్డీ రేట్లు రాబోతున్నాయి. ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను కరోనా ముందటి స్థాయిలకి తీసుకొస్తుందని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి రుణ వాయిదాలు(Home Loan EMIs)భారీగా పెరగబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు కానీ, ఇప్పటికే లోన్‌పై ఇంటిని తీసుకున్న వారు కానీ ఇక నుంచి ఎక్కువ వాయిదాలను చెల్లించాలని పేర్కొంటున్నారు.

Authored byKoteru Sravani | Samayam Telugu 26 May 2022, 7:35 pm

ప్రధానాంశాలు:

  • కరోనా ముందటి స్థాయిలకు ఆర్‌బీఐ రేట్లు పెంపు
  • చారిత్రాత్మక కనిష్ట వడ్డీ రేట్లకు ఇక స్వస్తి
  • 10 శాతం వరకు పెరగనున్న ఇంటి రుణ ఈఎంఐలు
  • ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఇబ్బంది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Home Loan EMIs
భారీగా పెరగనున్న ఇంటి రుణ ఈఎంఐలు
Home Loan EMIs : కరోనా తర్వాత ఇన్ని రోజులు చౌక వడ్డీ రేట్లను ఆస్వాదించిన ప్రజలకు బ్యాడ్‌న్యూస్. చారిత్రాత్మక కనిష్ట వడ్డీ రేట్లకు ఇక స్వస్తి పలకబోతుంది రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా. ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) కీలక వడ్డీ రేట్లను పెంచడం మొదలు పెట్టేసింది. ఈ నెలలో అకస్మాత్తుగా భేటీ అయిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ.. 40 బేసిస్ పాయింట్లు వరకు వడ్డీ రేట్లను పెంచింది. అంతేకాక తదుపరి సమావేశాలలో కూడా వడ్డీ రేట్లను పెంచుతామని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంకేతాలిచ్చారు. దీంతో ఇక చౌక వడ్డీ రేట్లకు రాంరాం చెప్పాల్సి వస్తుంది.
భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నింటిన్ని ద్రవ్యోల్బణ సమస్య వేధిస్తోంది. ధరలు భారీగా పెరిగి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్‌గా సెంట్రల్ బ్యాంకులన్ని వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకులకు అనుగుణంగా ఆర్‌బీఐ కూడా వడ్డీ రేట్లను పెంచడం మొదలు పెట్టేసింది. దీంతో కరోనా ముందటి స్థాయిలకు ఇక వడ్డీ రేట్లు రాబోతున్నాయి.

Also Read : BMW i4 Electric Sedan : ఒక్కసారి ఛార్జింగ్‌కే 590 కి.మీ ప్రయాణం.. అదరగొడుతోన్న ఫీచర్స్

ఆర్‌బీఐ వడ్డీ రేట్లను పెంచితే బ్యాంకులు కూడా తమ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లను పెంచుతాయి. చాలా బ్యాంకులు హోమ్ లోన్లపై రెపో ఆధారిత వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఆర్‌బీఐ రెపో పెరిగిన ప్రతిసారి ఈ బ్యాంకులలో కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి. కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థకు బూస్టప్ ఇచ్చేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను 1.25 శాతం తగ్గించింది. ఇక ఆర్‌బీఐ ప్రీ కరోనా స్థాయిలకు వడ్డీ రేట్లను పెంచుతుందని బ్యాంకింగ్ నిపుణులు అంచనావేస్తున్నారు. దీంతో హోమ్ లోన్ల వడ్డీ రేట్లు 10 శాతం వరకు పెరగొచ్చని అంచనావేస్తున్నారు.

ఉదాహరణకు.. ఒకవేళ రేట్లను 1.25 శాతం మేర ఆర్‌బీఐ పెంచితే.. 20 ఏళ్ల కాలానికి మీరు తీసుకున్న రూ.30 లక్షల రుణానికి ప్రస్తుతం మీరు చెల్లిస్తోన్న రూ.22,811 ఈఎంఐ.. రూ.25,093కు పెరగనుందని అంచనాలున్నాయి. ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై లోన్లు తీసుకున్న ప్రతి ఒక్క బారోవర్‌పై ఈ ప్రభావం పడనుందని నిపుణులు పేర్కొంటున్నారు. గత రెండు నెలలుగా చాలా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు హోమ్ లోన్ల వడ్డీ రేట్లను పెంచాయి. ఎస్‌బీఐ తన ఈబీఆర్, ఆర్‌ఎల్ఎల్ఆర్ హోమ్ లోన్లపై వడ్డీ రేటును 0.4 శాతం పెంచింది. ఈ పెంచిన వడ్డీ రేటును జూన్ 1, 2022 నుంచి అమల్లోకి తెస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ కూడా ఫ్లోటింగ్ వడ్డీ రేటును 0.35 శాతం పెంచింది.

Also Read : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద డీల్.. ఎన్ని కోట్లకు కుదిరిందంటే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.