యాప్నగరం

ఇండియన్స్ అంత ఖరీదైన కార్లు కొనలేరట!

ఇండియాలో ఇంకా ఇప్పుడప్పుడే ఎలక్ట్రానిక్ కార్స్ కొనుగోలు చేయడానికి భారతీయులు సిద్ధంగా లేరని అన్నారు...

ET Online 27 May 2017, 12:02 pm
ఇండియాలో ఇంకా ఇప్పుడప్పుడే ఎలక్ట్రానిక్ కార్స్ కొనుగోలు చేయడానికి భారతీయులు సిద్ధంగా లేరని అన్నారు హోండా కార్స్ ఇండియా సీఈఓ యోచిరొ యునో. అందుకు కారణం దేశంలో మౌళిక వసతులు ఇంకెంతో మెరుగు పడాల్సిన అవసరం ఒకటైతే, సాధారణ కార్ల కన్నా ఎలక్ట్రానిక్ కార్ల ఖరీదు రెండింతలు వుండటం మరో కారణం అని యోచిరొ యునో అభిప్రాయపడ్డారు. తమ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లని రూపొందిస్తోందని.. కాకపోతే ఇప్పుడప్పుడే ఎక్కువ సంఖ్యలో ఆ కార్లని ఇండియన్ రోడ్స్‌పై చూడాలనుకోవడం తొందరపాటే అవుతుందని యునో పేర్కొన్నారు.
Samayam Telugu honda cars india ceo yoichiro ueno says india is not yet ready for electric cars
ఇండియన్స్ అంత ఖరీదైన కార్లు కొనలేరట!


భారతీయులు అధిక ధరలు కలిగిన ఉత్పత్తులని కొనుగోలు చేసేందుకు ఆచీతూచీ వ్యవహరిస్తారు. దీనికితోడు ఇండియా లాంటి పెద్ద దేశంలో ఎలక్ట్రిక్ కార్లకి అనుగుణంగా మౌళిక వసతులు ఏర్పాటు చేయడం కష్టంతో కూడుకున్నదని యునో తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.