యాప్నగరం

Hyderabad: హైదరాబాద్‌లో హాట్ కేకుల్లా ఇళ్ల విక్రయాలు.. రేట్లు పెరుగుతున్నా తగ్గట్లే.. 3 నెలల్లోనే అన్ని కొన్నారా?

Hyderabad: హైదరాబాద్ మహానగరంలో ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నగరం నలుదిక్కుల్లో హాట్ కేకుల్లా విక్రయమవుతున్నాయి. నివాస గృహాల సేల్స్, కొత్త ప్రాజెక్టుల ప్రారంభంలో హైదరాబాద్ దూసుకెళ్తోంది. కొత్త ఏడాది తొలి త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇళ్ల విక్రయాలకు గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ నివేదిక విడుదల చేసింది. ఆ వివరాలేంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 16 Apr 2023, 1:15 pm
Hyderabad: సొంత ఇళ్లు అనేది ప్రతి ఒక్కరి కల. దానిని నెరవేర్చుకునేందుకు కష్టపడుతుంటారు. ప్రస్తుతం హైదరాబాద్ మహా నగరంలో నివాస గృహాలకు (residential plots for sale in hyderabad) ఫుల్ డిమాండ్ ఉంది. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయంటే నమ్ముతారా? అవునండీ ఇది నిజమే. కొత్త ఏడాది 2023 తొలి మూడు నెలల్లో 8,300 రెసిడెన్షియల్ యూనిట్స్ విక్రయమైనట్లు గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా (Knight Frank India Report) తెలిపింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారంగా చూసుకుంటే ఇది 19 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. ఈ కొత్త ఏడాదిలో ఇప్పటి వరకు హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్టుల్లో రెసిడెన్షియల్ యూనిట్స్ 10,986 ఉన్నట్లు పేర్కొంది. ఇది కూడా ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం చూస్తే 7 శాతం ఎక్కువేనని తెలిపింది. ప్రస్తుతం నగరంలో సగటు ధర చదరపు అడుగుకు రూ.4,997గా ఉన్నట్లు వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే సగటు ధర 5 శాతం పెరిగినట్లు స్పష్టం చేసింది.
Samayam Telugu hyderabad-property


నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. ఇళ్ల ధరలు పెరుగుతున్నా, గృహ రుణాల వడ్డీ రేట్లు పెరుగుతున్నా, నగదు సరఫరా సరిగా లేకపోయినప్పటికీ సొంతిటి కల నెరవేర్చుకునేందుకు జనాలు ఎగబడుతున్నారని, దీంతో డిమాండ్ పెరుగుతున్నట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉందని తెలిపింది. ఇళ్ల విక్రయాల్లో ఎక్కువ శాతం ఐటీ సెక్టార్ ఉద్యోగులు ఉన్నట్లు నివేదించింది.

'ఆర్థిక ఏడాది 2023లో మొత్తంగా హైదరాబాద్‌లో 44,577 కొత్త యూనిట్లు ప్రారంభమయ్యాయి. అదే ఆర్థిక ఏడాది 2022లో చూసుకుంటే 36,642 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. అంటే క్రితం ఏడాదితో చూస్తే కొత్త యూనిట్లలో 21.64 శాతం వృద్ధి నమోదైంది. అలాగే ప్రతి మూడు నెలలకు సగటున 11,144 యూనిట్లు కొత్తగా లాంఛ్ అవుతున్నాయి. 2023 ఆర్థిక ఏడాదిలో కొత్త సేల్స్‌లో 32,353 రెసిడెన్షియల్ యూనిట్లు ఉన్నాయి. 2022లో చూసుకుంటే ఇది 24,402 యూనిట్లుగా ఉంది. 32.58 శాతం వృద్ధి నమోదైంది. ఆర్థిక ఏడాది 2023లో సగటున మూడు నెలల్లో 8,088 యూనిట్లు విక్రయమవుతున్నాయి.' అని తెలిపింది నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక. మరోవైపు.. కమెర్షియల్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్‌లో ఆర్థిక ఏడాది 2023లో ఏకంగా 6 మిలియన్ల చదరపు అడుగులు విక్రయమైనట్లు పేర్కొంది.

మార్చి నెలలో హైదరాబాద్‌లో 6,414 అపార్ట్‌మెంట్ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఫిబ్రవరి నెలతో పోలిస్తే 12 శాతం వృద్ధి నమోదైనట్లు నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. ఇందులో 53 శాతం ప్రాపర్టీలు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాలే కావడం గమనార్హం.70 శాతం వెయ్యి నుంచి 2 వేల చదరపు అడుగుల ప్రాపర్టీలు ఉన్నట్లు నివేదిక తెలిపింది.

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.