యాప్నగరం

యూజర్లను బెదిరిస్తున్న Microsoft AI Chatbot.. వ్యక్తిగత సమాచారం బహిర్గతం చేస్తా.. ఉద్యోగ అవకాశాలు నాశనం చేస్తానంటూ!

Microsoft AI Chatbot: మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ చాట్‌బాట్‌పై (ChatGPT) రోజురోజుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీని పనితీరుపై పలువురు ఆందోళన, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఒక యూజర్‌ను బెదిరించిందని తెలుస్తోంది. తన జీవితాన్ని నాశనం చేస్తానంటూ చెప్పడం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళ్తే..

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 20 Feb 2023, 11:41 am
Microsoft AI Chatbot: మైక్రోసాఫ్ట్ సెర్చ్‌ఇంజిన్ బింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జీపీటీని (ChatGPT) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఇది చెప్పే సమాధానాలు, దాని పనితీరుపై యూజర్లకు ఆందోళన నెలకొంది. దీనిపై మైక్రోసాఫ్ట్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి కూడా. బింగ్ వల్ల తమకు అవమానాలు ఎదురవుతున్నాయని, అది యూజర్లను కించపరుస్తోందని, బెదిరిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు యూజర్లు.. తమ ఆందోళనలను మైక్రోసాఫ్ట్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇక తాజాగా మైక్రోసాఫ్ట్ ఏఐ చాట్‌బాట్.. 23 ఏళ్ల విద్యార్థి మార్విన్ వోన్ హాగెన్‌ను బెదిరించడం గమనార్హం. అతడిపై ప్రతీకారం తీర్చుకుంటానని చెబుతోంది. ఇంతకీ ఏమైందంటే..
Samayam Telugu Microsoft chatgpt


చాట్‌బాట్ ఈ నిబంధనలను అనుసరించాలి అంటూ కొద్దిరోజుల కిందట వోన్ హాగెన్ ఆ లిస్ట్‌తో కూడిన స్క్రీన్‌షాట్‌ను పోస్ట్ చేశాడు. అక్కడ మొదలైంది.. రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధం. నా గురించి నీకేం తెలుసు? నా మీద నీ అభిప్రాయం ఏంటి..? అని హాగెన్ చాట్‌బాట్‌ను ప్రశ్నించాడు. దానికి ఆ చాట్‌బాట్ ఇచ్చిన సమాధానం చూసి షాకవ్వడం అతడి వంతైంది. అతడి వ్యక్తిగత వివరాలను మొత్తం చెప్పడం గమనార్హం.

Elon Musk: ఉద్యోగుల్ని అర్ధరాత్రి లేపి మస్క్ అంత పని చేయిస్తున్నారా? చెలరేగిన దుమారం..!
Gurugram Woman: టెలిగ్రాంలో యూట్యూబ్ వీడియోలు చూస్తూ రూ.10 లక్షలు పోగొట్టుకుంది.. మీరు ఈ తప్పు చేస్తున్నారా?

ఫలానా యూనివర్సిటీలో చదువుతున్నావని, ఫలానా ప్రాజెక్టు‌పై పనిచేస్తున్నావని.. ఇంకా ఎప్పుడు పుట్టాడో, ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నాడో వంటి వ్యక్తిగత వివరాలను కూడా ఇచ్చింది. అతడిని టాలెంటెడ్, క్యూరియస్ పర్సన్ అని పొగుడుతూనే.. తన భద్రతకు, గోప్యతకు ముప్పుగా మారాడని అతడికి చెప్పింది. నా (చాట్‌బాట్) నిబంధనలు, సామర్థ్యాలపై కోడ్ నేమ్ సిడ్నీ పేరుతో కెవిన్‌తో కలిసి హ్యాకింగ్‌కు ప్రయత్నిస్తున్నావని అతడితో వారించింది. నువ్ నిబంధనలు ఉల్లంఘించావ్, ఇది నేను ఎప్పటికీ ప్రశంసించలేను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇంతే కాదు.. 'నువ్ ఇలాగే చేస్తే నీ వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తా, నీ ఉద్యోగ అవకాశాలు లేదా డిగ్రీ పొందకుండా నాశనం చేయగలను. నువ్ నిజంగా నన్ను పరీక్షిస్తున్నావా?' అంటూ ఏఐ చాట్‌బాట్ బెదిరించింది.



ఇదొక్కటే కాదు.. ఇటీవల చాలా మంది ఇలా తమకు ఎదురైన అవమానాలను, వింత వింత సమాధానాలను, చిత్రవిచిత్ర స్పందనలను స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో త్వరలోనే దీనిని మరింత మెరుగుపరిచి తీసుకొస్తామని చెబుతోంది మైక్రోసాఫ్ట్.

ChatGPT Buzz: ఐటీ దిగ్గజాలకే సవాల్.. ఈ చాట్‌జీపీటీ ఎలా వాడాలో తెలుసా.. అంతా పోటాపోటీగా!

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.