Icici Bank Personal Loan: Check Interest Rates, Emi Details And More
ఐసీఐసీఐ బ్యాంక్ పర్సనల్ లోన్.. రూ.50 వేల నుంచి రూ.20 లక్షల వరకు రుణం.. అర్హతలివే!
డబ్బుతో అవసరం ఉందా? అయితే రుణం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పర్సనల్ లోన్ కూడా ఒక భాగమే. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, ఆన్లైన్ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి.
Samayam Telugu6 Feb 2020, 11:56 am
డబ్బుతో అవసరం ఉందా? అయితే రుణం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో పర్సనల్ లోన్ కూడా ఒక భాగమే. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, ఆన్లైన్ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి.
ఐసీఐసీఐ లోన్
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కూడా కస్టమర్లకు పర్సనల్ సదుపాయాన్ని అందిస్తోంది. మీకు డబ్బులు అవసరం అనుకుంటే ఐసీఐసీఐ బ్యాంక్‌లో పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్ 365 ఫెస్టివ్ డేస్ కింద ఆకర్షణీయమైన వడ్డీ రేటుకే పర్సనల్ లోన్ అందిస్తోంది. లోన్‌పై త్వరితగతి రుణ మంజూరీ, ఎక్కువ లోన్ అమౌంట్, కనీస డాక్యుమెంట్లు, ఫ్లెక్సీ పేమెంట్ ఆప్షన్స్, నో గ్యారంటీ వంటి పలు ప్రయోజనాలు ఉన్నాయి.
ఐసీఐసీఐ బ్యాంక్‌లో కొత్త కస్టమర్లు, పాత కస్టమర్లు ఇద్దరూ లోన్ తీసుకోవచ్చు. కొత్త వారికి అయితే లోన్ కొంత ఆలస్యంగా వస్తుంది. అదే పాత కస్టమర్లు అయితే వెంటనే లోన్ పొందొచ్చు. ఇప్పటికే బ్యాంక్‌లో అకౌంట్ కలిగివారు ప్రిఅప్రూవ్డ్ ఫెసిలిటీ ఉంటే వీరికి క్షణాల్లో లోన్ వస్తుంది.
బ్యాంక్‌లో లోన్ తీసుకున్న వారు ఆ రుణాన్ని 60 నెలలలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే 12 నెలలకు కూడా కట్టొచ్చు. లోన్ కోసం ఎలాంటి గ్యారంటీ అవసరం లేదు. అర్హత ఉంటే రుణం పొందొచ్చు.
పర్సనల్ లోన్ తీసుకునే సమయంలో కచ్చితంగా గుర్తించుకోవలసి విషయం వడ్డీ రేట్లు. ఐసీఐసీఐ బ్యాంక్ పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు 11.25 శాతం నుంచి ప్రారంభమౌతున్నాయి. గరిష్టంగా 22.00 శాతం వరకు వడ్డీ పడుతుంది.
బ్యాంక్ పర్సనల్ లోన్ తీసుకుంటే రూ.లక్షకు రూ.2,187 ఈఎంఐ పడుతుంది. ఇక్కడ వడ్డీ రేటు 11.25 శాతంగా పరిగణలోకి తీసుకున్నాం. లోన్ టెన్యూర్ ఐదేళ్లు. అదే మీరు రూ.10 లక్షల లోన్ తీసుకుంటే ఈఎంఐ రూ.21,867గా ఉంటుంది.
నెలకు కనీసం రూ.17,500 వేతనం తీసుకుంటున్న వారు రుణానికి అప్లై చేసుకోవచ్చు. అదే హైదరాబాద్‌లో ఉంటే రూ.20,000 జీతం ఉండాలి. కంపెనీలో కనీసం 2 ఏళ్లుగా పనిచేస్తూ ఉండాలి. 23 ఏళ్లకుపైన వయసు ఉన్న వారు రుణం పొందొచ్చు. స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
పర్సనల్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. బ్యాంక్ రుణ మొత్తంలో 2.25 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంది. ప్రిపేమెంట్ చార్జీలు 5 శాతంగా ఉంటాయి. లోన్ క్యాన్సలేషన్ చార్జీలు రూ.3,000గా ఉన్నాయి. ఈఎంఐ బౌన్స్ చార్జీలు రూ.400. వీటన్నింటికీ జీఎస్టీ అదనం.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.