యాప్నగరం

స‌మ్మెకు పిలుపునిచ్చిన ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగులు

ఐడీబీఐలో కొంత మంది ఆఫీస‌ర్ గ్రేడ్ ఉద్యోగులు స‌మ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు యాజ‌మాన్యానికి నోటీసులు ఇచ్చిన‌ట్లు ఐడీబీఐ బ్యాంకు రెగ్యులేట‌రీ సంస్థ‌ల‌కు స‌మాచార‌మిచ్చింది.

Samayam Telugu 14 Jul 2018, 3:11 pm
ఐడీబీఐ అధికారులు కొందరు జులై 16 నుంచి ఆరు రోజుల పాటు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బ్యాంకు అధికారులు నోటీసులను ఐడీబీఐ బ్యాంక్‌కు అందించారు. తమకు నోటీసులు అందినట్లు రెగ్యులేటరీ సంస్థలకు ఐడీబీఐ బ్యాంకు సమాచారం అందించింది. జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ, ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను కొనుగోలు, వేతనానికి సంబంధించిన సమస్యలపై నిరసనగా కొందరు ఐడీబీఐ అధికారులు సమ్మెచేస్తున్నట్టు తెలిసింది.
Samayam Telugu idbi bank content


2018 జూలై 16 నుంచి 2018 జూలై 21 వరకు కొందరు అధికారులు సమ్మెకు దిగబోతున్న నోటీసులను తాము అందుకున్నామని ఐడీబీఐ బ్యాంక్, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2012 నవంబరు నుంచి ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల వేతనాలను సవరించలేదు. వేతన సవరణ విషయంలో గత ఏడాదే ఓ సారి సమ్మె నోటీసు ఇచ్చినా యాజ‌మాన్యం ఇచ్చిన హామీతో విరమించుకున్నారు. ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను ఎల్ఐసీకి విక్రయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు 'ఆల్ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్ అసోసియేషన్' ఇప్పటికే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి వినతిపత్రం అందించింది. ఐడీబీఐ అధికారులు, ఉద్యోగుల‌కు సమ్మెకు దిగడమే తప్ప మరో గ‌త్యంత‌రం లేదని పేర్కొంది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.