యాప్నగరం

ఐడియా 199 ప్లాన్‌తో 2జీబీ డేటా

ఇప్పటివరకూ 199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ లో భాగంగా 28 రోజులపాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 SMS లతో పాటుగా ప్రతిరోజూ 1.4 జీబీ డేటాను అందించింది ఐడియా.

Samayam Telugu 8 Jul 2018, 4:36 pm
రిల‌య‌న్స్ జియోకు కౌంట‌ర్ ఇచ్చేందుకు ఆదిత్యా బిర్లా ఆధ్వ‌ర్యంలోని టెలికాం సంస్థ ఐడియా స‌రికొత్త ఆఫ‌ర్ తీసుకొచ్చింది. ఇప్పటివరకూ 199 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ లో భాగంగా 28 రోజులపాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 100 SMS లతో పాటుగా ప్రతిరోజూ 1.4 జీబీ డేటాను అందించింది ఐడియా. ఈ ప్లాన్‌లో డేటా బెనిఫిట్స్‌ ను సవరించింది ఐడియా. ఇకపై ప్రతిరోజూ 2జీబీ డేటాను అందించనుంది. డేటా బెనిఫిట్స్ ను సవరించడం ద్వారా యూజర్లకు మరింత దగ్గర కావాలని ఐడియా భావిస్తోంది.
Samayam Telugu idea offer
ఐడియా 2జీబీ డేటా ప్లాన్

Read also ఎయిర్‌టెల్ x జియో x వొడాఫోన్ x ఐడియా బెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే

డేటా ఆఫ‌ర్ల‌లో ఎప్పుడూ వెన‌కుండే ఐడియా సెల్యూలార్ సరికొత్త ఆఫర్ తో యూజర్ల ముందుకు వచ్చింది ఐడియా. రిల‌య‌న్స్ జియో, ఎయిర్టెల్ పోటాపోటీగా దూసుకెళుతూ ఆఫ‌ర్ల‌తో వినియోగ‌దార్ల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ప్ప‌టికీ ఐడియా స్మార్ట్ నెట్వ‌ర్క్‌తోనే యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. కానీ పెద్ద‌గా ఆఫ‌ర్ల జోలికి వెళ్ల‌డం లేదు. త‌క్కువ ధ‌ర ప్లాన్ల‌లో మొద‌టిసారి జియోకు పోటీనిచ్చేందుకు ఐడియా సిద్ధ‌మైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.