యాప్నగరం

Idea Plans: జియో, ఎయిర్టెల్‌కు ధీటుగా ఐడియా 2జీబీ ప్లాన్

ప్రస్తుతం ఉన్న టెలికాం రంగంలోని పోటీ నేపథ్యంలో ఐడియా సరికొత్త 2జీబీ ఆఫర్ లాంచ్ చేసింది

Samayam Telugu 24 May 2018, 5:05 pm
ప్రస్తుతం ఉన్న టెలికాం రంగంలోని పోటీ నేపథ్యంలో ఐడియా సరికొత్త ఆఫర్ లాంచ్ చేసింది. తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ విడుదల చేసింది. తాజా ఆఫర్ ను అనుసరించి కేవలం రూ. 499 తో రీఛార్జ్ చేసుకుంటే ప్రతి రోజూ 2జీబీ డేటా అందేలా ప్లాన్ తీసుకొచ్చింది.దీంతో పాటు ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్‌ల‌ను సైతం అందిస్తోంది.
Samayam Telugu idea
ఐడియా స‌రికొత్త ఆఫర్

ఐడియా 2జీబీ ప్లాన్


టెలికాం దిగ్గ‌జాలైన‌ జియో, ఎయిర్ టెల్ కు పోటీగా ఐడియా ఈ ప్లాన్ ను ఆవిష్కరించింది. అయితే జియో సైతం రూ.498 ప్లాన్ ను 91 రోజుల వ్యాలిడిటీతో 182 జీబీ డేటా అందిస్తోంది. అటు ఎయిర్ టెల్ కూడా రూ.499 ప్లాన్ ను 82 రోజుల వ్యాలిడిటీతో 164 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐడియా ఆఫర్ ఏ మేరకు సక్సెస్ అవుతోందనేది గమనార్హం.
ఐడియా 2జీబీ ప్లాన్ గురించి సంక్షిప్తంగా
  • ప్లాన్: రూ. 499
  • డేటా: 2జీబీ 4జీ డేటా (ప్రతి రోజూ)
  • కాల్స్: అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టిడీ కాల్స్
  • ఎస్ఎంఎస్‌లు: రోజుకు వంద మాత్రమే
  • వ్యాలిడిటీ: 82 రోజులు మాత్రమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.