యాప్నగరం

జియోకు పోటీగా ఐడియా కొత్త సర్వీసులు!

దేశంలో మూడో అతిపెద్ద టెలీకాం కంపెనీ అయిన ఐడియా సెల్యులర్ రిలయన్స్ జియోకి పోటీగా కొన్ని కొత్త సర్వీసులను తీసుకొస్తోంది.

TNN 26 Jan 2017, 9:52 pm
దేశంలో మూడో అతిపెద్ద టెలీకాం కంపెనీ అయిన ఐడియా సెల్యులర్ రిలయన్స్ జియోకి పోటీగా కొన్ని కొత్త సర్వీసులను తీసుకొస్తోంది. పూర్తిస్థాయి డిజిటల్ సర్వీస్ కంపెనీగా మారేందుకు మూవీస్, టీవీ, మ్యూజిక్, గేమ్స్ తదితర యాప్‌లను ప్రవేశపెట్టనున్నట్లు ఐడియా గురువారం వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని వాయిస్, డాటా సర్వీసుల నుంచి పూర్తిస్థాయి డిజిటల్ సర్వీసుగా మారనున్నట్లు వివరించింది.
Samayam Telugu idea to launch new services next week to counter reliance jio
జియోకు పోటీగా ఐడియా కొత్త సర్వీసులు!


దేశంలో ఎంటర్‌టైన్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యం ఉందని, అందుకనే వినియోగదారులకు ఒక కంప్లీట్ యాప్ ష్యూట్‌ను అందిస్తామని ఐడియా మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా చెప్పారు. ఐడియాకు 500 మిలియన్ యూజర్లున్నారు. అయితే ఇప్పటికే రిలయన్స్ ఉచిత సర్వీసులతో పాటు, అనేక ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌లను ఉచితంగా అందిస్తోంది. దీంతో చాలా మంది పెద్ద నెట్‌వర్క్‌లను పక్కనపెట్టి జియోకు మారుతున్నారు. అందుకనే ఎలాగైనా జియోకి పోటీనిచ్చి తమ వినియోగదారులను కాపాడుకోవాలని టాప్ 3 టెలీకాం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఐడియా ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.