యాప్నగరం

ఉద్యోగులకు హెచ్చరిక.. 8 రోజులే గడువు.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే..

మీకు ఉద్యోగం చేస్తున్నారా? మీకు పాన్ కార్డు ఉందా? అయితే మీరు కచ్చితంగా మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. జీతం నిలుపుదల అయ్యే అవకాశముంది.

Samayam Telugu 22 Jun 2021, 2:39 pm

ప్రధానాంశాలు:

  • ఉద్యోగులకు అలర్ట్
  • వెంటనే ఇలా చేయండి
  • లేదంటే ఇబ్బంది

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu aadhaar pan link
ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుందా? వెలువడుతున్న నివేదికలను గమనిస్తే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. పాన్ ఆధార్ లింక్ విషయమై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఆదాయపు పన్ను శాఖ పాన్ ఆధార్ లింక్ గడువును దాదాపు 13 సార్లు పొడిగించుకుంటూ వచ్చింది. ఇకపై మరోసారి పాన్ ఆధార్ లింక్ గడువు పొడిగింపు ఉండకపోవచ్చు. అందువల్ల ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నారు.

Also Read: undefined

ఉద్యోగులు వారి పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకునే చూడాలని ఇన్‌కమ్ ట్యాక్స్ కంపెనీలకు తెలియజేసింది. దీంతో జూన్ 30 నాటికి పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే.. జూలై వేతనాలు ఉద్యోగులకు రాకపోవచ్చు. కంపెనీలు అలాగే నిలుపుదల చేసే ఛాన్స్ ఉంది.

ఉద్యోగులకు పాన్ ఆధార్ లింక్ చేసుకున్న తర్వాత వేతనాలు రావొచ్చు. అయితే ఇప్పుడు గడువు దగ్గరకు రావడంతో జూలై నెల వేతనాలు రావొచ్చు. అయితే అటుపైన వేతనాలను స్టాప్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఉద్యోగులు ఎవరైనా పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే వెంటనే లింక్ చేసుకోండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.