యాప్నగరం

Akshaya Tritiya 2018: బంగారం కొనుగోళ్లపై భారీ ఆఫర్లు

అక్షయ తతీయను పురష్కరించుకుని కొనుగోలుదారులను ఆకర్షించడానికి అభరణాల కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటించాయి.

Samayam Telugu 18 Apr 2018, 8:47 am
అక్షయ తృతీయ సందర్బంగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. గత ఎనిమిది సెషన్లలో రూ.650 పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు ఈ ఏడాది ఏప్రిల్‌ 18న అక్షయ తృతీయ రోజు నేపథ్యంలో స్థానిక వర్తకులు పసిడి కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో గత కొద్ది రోజులుగా అపరంజి ధరలో వరసగా పెరుగుదల చోటు చేసుకుంది. అక్షయ తృతీయ రోజు కొంచెమైన పసిడి కొనుగోలు చేసే సంపద సిద్దిస్తుందన్న నమ్మకంలో చాలా మంది ఆరోజు ఈ లోహాన్ని కొనుగోలు చేయడం దేశంలో ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో గత ఎనిమిది సెషన్లలో పది గ్రాముల బంగారం రూ.650 ప్రియం కాగా, కిలో వెండిపై రూ.850 పెరుగుదల చోటు చేసుకుంది. మంగళవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరిగి వరుసగా రూ.32,000గా, రూ.31,850గా నమోదయ్యింది. కాగా కిలో వెండిపై మాత్రం రూ.100 తగ్గి రూ.39,900గా పలికింది.
Samayam Telugu gold-rates-up- బంగారం ధరలు


పోటాపోటీ ఆఫర్లు..
అక్షయ తతీయను పురష్కరించుకుని కొనుగోలుదారులను ఆకర్షించడానికి అభరణాల కంపెనీలు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటించాయి. కల్యాణ్‌ జ్యువెల్లరీస్‌ ఏకంగా 25 లక్కీ కస్టమర్లకు మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లను గెలుచుకునే ఆఫర్‌ను ప్రకటించింది. అదే విధంగా పసిడి నాణేలను ఆఫర్లుగా అందిస్తోంది. ప్రతీ రూ.5000 బంగారు అభరణాల కొనుగోలుపై ఒక లక్కీ కూపన్‌ గెలుచుకునే అవకాశాన్ని అందిస్తోంది. కాగా మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమాండ్స్‌ ప్రత్యేకంగా 'అక్షయ తతీయ' ఆన్‌లైన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. అదే విధంగా రూ.15,000 విలువ చేసే బంగారం ఆభరణాల కొనుగోలుపై 150 మిల్లీ గ్రాముల బంగారం నాణాన్ని ఉచితంగా అందించనున్నట్టు తెలిపింది. కనీస ఆర్డర్ రూ.15,000 ఉండాలి. తదుపరి కొనుగోలుపై ఈ కార్డును వాడుకోవచ్చు. ఆఫర్లు ఈ నెల 25 వరకు ఉంటాయి.
తనిష్క్‌ జువెల్లర్స్‌ బంగారం, డైమాండ్‌ జువెల్లర్స్‌ మేకింగ్‌ ఛార్జీలను 25 శాతం వరకు తగ్గించింది. ఈ నెల 18 వరకే ఈ అవకాశం. పాత బంగారాన్ని ఇచ్చి ఎటువంటి తరుగు లేకుండా 100 శాతం ఎక్చేంజ్ చేసుకోవచ్చు.
ఇక ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సైతం రూ.19,999 విలువైన ఆభరణాలు కొంటే వజ్రాభరణాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది.
పీసీ జువెల్లరీ సైతం గోల్డ్‌ చెయిన్లను అ‍త్యంత తక్కువ ధరలకు అందించనున్నట్టు పేర్కొంది. ఇక ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ సైతం రూ.19,999 విలువైన ఆభరణాలు కొంటే వజ్రాభరణాలపై 70 శాతం వరకు తగ్గింపును ఆఫర్ చేస్తోంది.

Akshaya Tritiya, Gold Purchases, gold offers

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.