యాప్నగరం

అందులో మన నంబర్ 130 అంట!

వ్యాపారానికి అనుకూలమైన దేశాల్లో మన దేశం 130వ స్థానంలో నిలిచింది.

TNN 26 Oct 2016, 1:08 am
వ్యాపారానికి అనుకూలమైన దేశాల్లో మన దేశం 130వ స్థానంలో నిలిచింది. ప్రపంచబ్యాంక్ తన వార్షిక నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 190 దేశాల జాబితాలో మన దేశ స్థానం అరవై దేశాల కన్నా మెరుగ్గా ఉన్నప్పటికీ, మన ఆర్థిక వ్యవస్థ ఆధారంగా చూస్తే ఇది చాలా వెనకబడే ఉన్నట్లు లెక్క. గత ఏడాది మన దేశం 131వ స్థానంలో ఉండగా, ఈసారి ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 130 చేరింది. సంస్కరణల విషయంలో మనదేశం చిత్తశుద్ధిని ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంకు నివేదిక గుర్తించడం విశేషం. ఇదే విషయాన్ని నివేదికలో పేర్కొంది. దేశాన్ని అభివృద్ధి బాటన నిలిపే సంస్కరణలను శరవేగంగా ప్రభుత్వం అమలుచేస్తోందని కొనియాడింది.
Samayam Telugu india ranks 130 in ease of doing biz world bank report
అందులో మన నంబర్ 130 అంట!



ఇదిలా ఉండగా ఈ సూచిలో మిగిలిన బ్రిక్స్ దేశాలు మన కన్నా మెరుగైన ర్యాంకుల్లో ఉన్నాయి. రష్యా 51వ స్థానంలో నిలవగా, దక్షిణాఫ్రికా 73వ స్థానంలో, చైనా 84వ స్థానంలో, బ్రెజిల్ 116వ స్థానాల్లో ఉన్నట్లు నివేదిక పేర్కొంది.

India is ranked 130 out of 190 countries in World Bank Group's annual report on the ease of doing business, Doing Business 2017: Equal Opportunity for All, released on Tuesday. Even the one rank improvement is because India had been downgraded in the 2016 edition to 131 from 130 earlier. The World Bank report, however, recognised the concerted efforts made by India, and aside a special section “India has embarked on an ambitious reform path” to list the developments.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.