యాప్నగరం

Sugar Exports : పెరుగుతోన్న చక్కెర ధరలు, ఆరేళ్లలో తొలిసారి...

దేశీయంగా పెరుగుతోన్న ఆహార ధరలను నియంత్రణలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోంది. ఇటీవలే గోధుమ ఎగుమతులపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం.. తాజాగా చక్కెర ఎగుమతులపై కూడా ఆంక్షలు పెట్టాలని చూస్తోంది. పరిమితికి మించి చక్కెర ఎగుమతులు జరగకుండా ఆంక్షలు విధించబోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారి అయిన భారత్ ఈ ఆంక్షలు తీసుకువస్తుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. చక్కెర ఎగుమతులపై ఆంక్షల వార్తలతో.. ఆయా కంపెనీల స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి.

Authored byKoteru Sravani | Samayam Telugu 24 May 2022, 4:08 pm

ప్రధానాంశాలు:

  • చక్కెర ఎగుమతులపై ఆంక్షలు
  • 10 మిలియన్ టన్నులకే పరిమితం
  • దేశీయంగా ధరల నియంత్రణకు చర్యలు
  • ఇటీవలే గోధుమల ఎగుమతులపై కూడా ఆంక్షలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sugar Exports
చక్కెర ఎగుమతులపై ఆంక్షలు
Sugar Exports : చక్కెర ధరలు పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆరేళ్లలో తొలిసారి చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించాలని ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు రివీల్ చేశారు. ఈ సీజన్‌లో చక్కెర ఎగుమతులను 10 మిలియన్ టన్నులకే పరిమితం చేయాలని చూస్తున్నట్టు ప్రభుత్వాధికారులు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారి భారత్. బ్రెజిల్ తర్వాత రెండో అతిపెద్ద ఎగుమతిదారిగా భారత్‌నే ఉంది. ఈ వార్తల నేపథ్యంలో మార్కెట్లో చక్కెర స్టాక్స్ కంగుతిన్నాయి. ఈ కంపెనీల స్టాక్స్ 14 శాతానికి పైగా పడిపోయాయి.
చక్కెర ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేస్తుందని, ఈ ఎగుమతులు 10 మిలియన్ టన్నులకు దాటకుండా చూసుకోనుందని శ్రీ రేణుక షుగర్స్ అతుల్ చతుర్వేది తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత.. ప్రపంచవ్యాప్తంగా ఆహారోత్పత్తుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. కమోడిటీల ధరలు పెరుగుతుండటంతో.. తమ దేశ ప్రజలను కాపాడుకునేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు పలు రక్షణాత్మక చర్యలను తీసుకుంటున్నాయి. మలేషియా కూడా జూన్ 1 నుంచి చికెన్ ఎగుమతులను నిషేధిస్తోంది. పామాయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించిన ఇండోనేషియా.. ఇటీవలే ఆ ఆంక్షలను ఎత్తివేసింది. ఇక ఇండియా చక్కెర కంటే ముందు గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఆంక్షలు కొనసాగుతుండటంతో.. ఆహార సంక్షోభం నెలకొంటుందని ఆర్థిక నిపుణలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Elon Musk : నాకు సీక్రెట్ అకౌంట్ ఉంది... అడగకుండానే రహస్యాన్ని బయటపెట్టిన కుబేరుడు

మన దేశం నుంచి చక్కెర ఎక్కువగా దిగుమతి చేసుకుంటోన్న దేశాలలో ఇండోనేషియా, ఆప్గనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, మలేషియా, ఆఫ్రికా దేశాలున్నాయి. 2017-18లో 6.2 లక్షల టన్నుల, 2018-19లో 38 లక్షల టన్నుల, 2019-20లో 59.60 లక్షల టన్నుల చక్కెరను భారత్ ఎగుమతి చేసింది. 2021-21లో 70 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులను చేపట్టింది.

2018-19 చక్కెర సీజన్‌లో 3.37 లక్షల టన్నుల, 2019-20 చక్కెర సీజన్‌లో 9.26 లక్షల టన్నుల, 2020-21 చక్కెర సీజన్‌లో 22 లక్షల టన్నుల షుగర్‌ను ప్రభుత్వం ఇథనాల్‌గా మార్చింది. 2021-2022లో 35 లక్షల టన్నుల అదనపు షుగర్‌ను ఇథనాల్‌గా మార్చింది. 2025 నాటికి 60 లక్షల టన్నుల షుగర్‌ను ఇథనాల్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో షుగర్ ఇన్వెంటరీల సమస్యలు తీరి, మిల్లులకు లిక్విడిటీ మెరగవుతుందని పేర్కొంది.

Also Read : పెట్రోల్ రూ.420, డీజిల్ రూ.400.. ప్రజలకు హెచ్చరికలు జారీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.